ఇంకొల్లు మండలంలో చివరి రోజు 23 నామినేషన్లు
ఇంకొల్లు, మేజర్‌న్యూస్ :
ఇంకొల్లు మండలంలో చివరిరోజు 23 నామినేషన్లు దాఖలైనట్లు ఎన్నికల అధికారి కె. రమేష్‌బాబు తెలిపారు. టి.డి.పి 9, జనసేన పార్టీ 4, వైసీపీ 10 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారన్నారు. ఇంకొల్లు-2 నుండి రామిశెట్టి అనూరాధ జనసేన పార్టీ, జెట్టి లక్ష్మీ రాజేశ్వరి, కరి కోటేశ్వరమ్మలు వైసీపీ, ఇంకొల్లు-3 నుండి దుడ్డు ఇందుమతి వైసీపీ, ఇంకొల్లు-4 నుండి దేవరకొండ ఏసయ్య జనసేన పార్టీ నుండి మొగిలి గోపాలకృష్ణమూర్తి టి.డి.పి, మల్లా బ్రహ్మయ్య, నీలం శ్రీనివాసరావులు వైసీపి, కొణికి నుండి బొడ్డు వెంకటేశ్వర్లు, కట్టా శివయ్యలు వైసీపీ, పెళ్ళూరి సాంబశివరావు జనసేన పార్టీ, దుద్దుకూరు నుండి మేడికొండ శిరీష, పిల్లి ద్వారకలు టి.డి.పి, గంగవరం నుండి భవనం పూర్ణిమ వైసీపీ, కరి రామాంజమ్మ, కరి అవంతిలు టి.డి.పి, వంకాయలపాడు నుండి బేతపూడి సుశీల టి.డి.పి, యర్రం కల్పన వైసీపీ, పూసపాడు నుండి నున్నా వెంకట్రావు జనసేన పార్టీ, పావులూరు నుండి పావులూరి నాగమల్లేశ్వరి టి.డి.పి, నాగండ్ల కోట శ్రీదేవి టి.డి.పి, ఇడుపులపాడు-2 అంబటి కోటేశ్వరరావు టి.డి.పి, భీమవరం రేవెళ్ళ భాస్కరరావు వైసీపి తరపున నామినేషన్లు దాఖలు చేశారు.
సూర్య రిపోర్టర్ : షేక్ జానిబాష, ఇంకొల్లు.