హోలీ క్రాస్ గర్ల్స్ హైస్కూల్ సమస్యలను పరిష్కరిస్తా - మంత్రి ఫరూక్
సూర్య, నంద్యాల బ్యూరో:హోలీ క్రాస్ గర్ల్స్ హైస్కూల్ సమస్యలను పరిష్కరిస్తానని మంత్రి ఫరూక్ అన్నారు. నంద్యాలలోని హోలీ క్రాస్ గర్ల్స్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు (హెడ్ మిస్ట్రెస్) మంజీరా వుడ్, స్థానిక మంత్రి క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పాఠశాలకు సంబంధించిన పలు సమస్యలను మంత్రి ఫరూక్ దృష్టికి తీసుకెళ్తూ వినతిపత్రం అందజేశారు.
పాఠశాల సమస్యలను శ్రద్ధగా విన్న మంత్రి ఫరూక్ వెంటనే సానుకూలంగా స్పందించారు. అక్కడికక్కడే జిల్లా విద్యాశాఖ అధికారి (డీఈఓ)తో ఫోన్‌లో మాట్లాడి, పాఠశాల సమస్యలను తక్షణమే పరిశీలించి పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. తమ వినతిపై సత్వరమే స్పందించి సమస్య పరిష్కారానికి చొరవ చూపిన మంత్రి ఎన్‌ఎండీ ఫరూక్ కు హెడ్ మిస్ట్రెస్ మంజీరా వుడ్ మరియు వారి టీం సభ్యులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం మంత్రి ఫరూక్ ని శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ కృపాకర్ పాల్గొన్నారు