హెచ్ పి వి వ్యాక్సిన్ తో క్యాన్సర్ కు అడ్డుకట్ట.
నక్కలదిన్నె లో బాలికలకు టీకాల కార్యక్రమం.
చాపాడు మేజర్ న్యూస్: మండలంలోని నక్కలదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో గురువారం డాక్టర్ పి ఓబులేసు, డాక్టర్ పి కావ్య మాధురి ఆధ్వర్యంలో 14 సంవత్సరాల బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ నివారణ " హెచ్ పి వి టీకా " వేశారు. బాలికల ఆరోగ్య రక్షణకు టీకా కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని బాలికల తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాలని డాక్టర్ ఓబులేసు తెలిపారు. బాలికలకు గర్భాశయ ముఖ క్యాన్సర్ రాకుండా రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా టీకా మందును అందిస్తున్నారు. ఈనెల 7 (ఏడవ) తేదీ వరకు హెచ్ పి వి వ్యాక్సిన్ ఉచితంగా అన్ని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వేస్తున్నారని , టీకాలు వేయించుకున్న ప్రతి బాలికకు టీకా వేసుకున్నట్లు సర్టిఫికెట్ అందచేశామని డాక్టర్ తెలిపారు. మహిళా వైద్యురాలు డాక్టర్ కావ్య మాధురి మాట్లాడుతూ ప్రభుత్వం ఎంతో ఖర్చు పెట్టి ఆడపిల్లలకు ఈ వ్యాక్సిన్ ఉచితంగా ఇస్తుందని, అర్హత గల పిల్లల తల్లిదండ్రులు ప్రోత్సాహించి తప్పకుండా వ్యాక్సిన్ వేయించిగర్భాశయ ముఖ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుకోవచ్చు అన్నారు. ఈ వ్యాక్సిన్ వలన కలిగే ప్రయోజనాలను బాలికలకు, వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించారు. చిన్న గురువలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు, అయ్యవారి పల్లె జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు 31 మంది బాలికలకు హెచ్ పివి టీకాలు వేసినట్లు డాక్టర్ పి ఓబులేసు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆరోగ్య విస్తరణ అధికారి యం. రాఘవయ్య, డిప్యూటి హెచ్ ఈ ఓ జయ ప్రకాశ్,సూపర్ వైజర్ విద్యార్థులు పాల్గొన్నారు.