గుండె పదిలం... మన అలవాట్లలోనే!
ఉమ్మడి గోదావరి జిల్లాల సూర్య ప్రత్యేక కథనం
ప్రపంచ హృదయ దినోత్సవం వేళ.. బోట్ క్లబ్‌లో ఆరోగ్యంపై మాటామంతీ
గుండె పదిలం.. మన అలవాట్లలోనే!
• నడక ఒక్కటే కాదు.. తిండి, నిద్ర, ఒత్తిడిపైనా శ్రద్ధ అవసరం
• సమస్య వచ్చేదాకా ఆగొద్దు.. ముందే పరీక్షించుకోవాలన్న వైద్యులు
• వాకర్స్ సందేహాలకు ఓపికగా సమాధానమిచ్చిన గుండె నిపుణులు
• బీపీ నుంచి ఈసీజీ వరకు.. బోట్ క్లబ్‌లోనే ఆరోగ్య పరీక్షలు
• కిమ్స్–ట్రస్ట్ వైద్య సేవలను అభినందించిన వాకర్స్

ఉమ్మడి గదావరి జల్లాల సూర్య బ్యూరో–కాకినాడ:
రోజూ నడుస్తున్నాం కదా.. గుండెకు ఢోకా ఏముంటుందనుకోవద్దు. నడకతో పాటు తినే తిండి, నిద్ర, ఒత్తిడి, రోజువారీ అలవాట్లు కూడా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. పైకి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా లోపల ముప్పు ఉండొచ్చు. అందుకే సమస్య వచ్చేదాకా ఆగకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని గుండె వైద్య నిపుణులు సూచించారు.
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్‌లో కిమ్స్–ట్రస్ట్ ఆసుపత్రి, బోట్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గుండె ఆరోగ్య అవగాహన సదస్సు, వైద్య శిబిరం ఇందుకు వేదికైంది. రోజూ ఆరోగ్యం కోసం నడిచే వాకర్స్‌కు అదే ప్రాంగణంలో గుండె నిపుణులు ఎదురెదురుగా కూర్చుని సందేహాలు తీర్చడం ప్రత్యేకతగా నిలిచింది. స్థానికులు సైతం శిబిరాన్ని ఉపయోగించుకున్నారు.
నడకతోనే సరిపోదు..
కిమ్స్–ట్రస్ట్ సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ పి.వి. నిశాంత్, డాక్టర్ బి.డి. పవన్ కుమార్ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సాగిన ముఖాముఖిలో రోజూ ఎంతసేపు నడవాలి, ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు పరీక్షలు అవసరం వంటి సందేహాలను వాకర్స్ వారి ముందుంచారు. ఒక్కో ప్రశ్నకు అర్థమయ్యేలా సమాధానమిస్తూ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ యు. రామకృష్ణ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జీవనశైలి ప్రాధాన్యాన్ని వివరించారు.
మాటతో పాటు.. పరీక్ష కూడా
అవగాహనతో సరిపెట్టలేదు. వచ్చిన వారికి అక్కడే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, బరువు పరీక్షించారు. అవసరమైన వారికి ఈసీజీ తీశారు. ఫలితాలను పరిశీలించి వైద్యులు తగిన సలహాలు ఇచ్చారు. గుండె వైద్య నిపుణులతో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కలగడంపై వాకర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మధ్యకు వచ్చి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలు చేసి సలహాలు అందించిన కిమ్స్–ట్రస్ట్ వైద్య బృందం సేవలను అభినందించారు.
ఆసుపత్రి గడప దాటి..
ప్రజల్లో ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్త పెరగాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కిమ్స్–ట్రస్ట్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవి సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన వారికి చికిత్స అందించడంతోనే కాకుండా ప్రజల మధ్యకు వెళ్లి ఆరోగ్యంపై అవగాహన పెంచడం కూడా ముఖ్యమన్నారు.
బోట్ క్లబ్ అధ్యక్షుడు అడబాల రత్న ప్రసాద్, కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ దాసరి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు సహకరించారు. ప్రపంచ హృదయ దినోత్సవం వేళ ఆరోగ్యంపై వైద్యులు చెప్పిన మాటలు, అక్కడికక్కడే చేసిన పరీక్షలు వాకర్స్‌కు ఉపయోగపడే కార్యక్రమంగా నిలిచాయి. ర్య బ్యూరో–కాకినాడ:
రోజూ నడుస్తున్నాం కదా.. గుండెకు ఢోకా ఏముంటుందనుకోవద్దు. నడకతో పాటు తినే తిండి, నిద్ర, ఒత్తిడి, రోజువారీ అలవాట్లు కూడా గుండె ఆరోగ్యాన్ని నిర్ణయిస్తాయి. పైకి ఆరోగ్యంగానే కనిపిస్తున్నా లోపల ముప్పు ఉండొచ్చు. అందుకే సమస్య వచ్చేదాకా ఆగకుండా ఎప్పటికప్పుడు ఆరోగ్యాన్ని పరీక్షించుకోవాలని గుండె వైద్య నిపుణులు సూచించారు.
ప్రపంచ హృదయ దినోత్సవాన్ని పురస్కరించుకుని మంగళవారం ఉదయం కాకినాడ బోట్ క్లబ్‌లో కిమ్స్–ట్రస్ట్ ఆసుపత్రి, బోట్ క్లబ్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన గుండె ఆరోగ్య అవగాహన సదస్సు, వైద్య శిబిరం ఇందుకు వేదికైంది. రోజూ ఆరోగ్యం కోసం నడిచే వాకర్స్‌కు అదే ప్రాంగణంలో గుండె నిపుణులు ఎదురెదురుగా కూర్చుని సందేహాలు తీర్చడం ప్రత్యేకతగా నిలిచింది. స్థానికులు సైతం శిబిరాన్ని ఉపయోగించుకున్నారు.
నడకతోనే సరిపోదు..
కిమ్స్–ట్రస్ట్ సీనియర్ కార్డియాలజిస్టులు డాక్టర్ పి.వి. నిశాంత్, డాక్టర్ బి.డి. పవన్ కుమార్ గుండెను ఆరోగ్యంగా ఉంచుకునేందుకు పాటించాల్సిన జాగ్రత్తలను వివరించారు. అనంతరం సాగిన ముఖాముఖిలో రోజూ ఎంతసేపు నడవాలి, ఆహారంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎప్పుడు పరీక్షలు అవసరం వంటి సందేహాలను వాకర్స్ వారి ముందుంచారు. ఒక్కో ప్రశ్నకు అర్థమయ్యేలా సమాధానమిస్తూ ఆరోగ్యంపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. సీనియర్ కార్డియోథొరాసిక్ సర్జన్ డాక్టర్ యు. రామకృష్ణ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో జీవనశైలి ప్రాధాన్యాన్ని వివరించారు.
మాటతో పాటు.. పరీక్ష కూడా
అవగాహనతో సరిపెట్టలేదు. వచ్చిన వారికి అక్కడే రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయి, బరువు పరీక్షించారు. అవసరమైన వారికి ఈసీజీ తీశారు. ఫలితాలను పరిశీలించి వైద్యులు తగిన సలహాలు ఇచ్చారు. గుండె వైద్య నిపుణులతో నేరుగా మాట్లాడి తమ సందేహాలను నివృత్తి చేసుకునే అవకాశం కలగడంపై వాకర్స్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల మధ్యకు వచ్చి ఆరోగ్యంపై అవగాహన కల్పించడంతో పాటు పరీక్షలు చేసి సలహాలు అందించిన కిమ్స్–ట్రస్ట్ వైద్య బృందం సేవలను అభినందించారు.
ఆసుపత్రి గడప దాటి..
ప్రజల్లో ఆరోగ్యంపై ముందస్తు జాగ్రత్త పెరగాలన్న ఉద్దేశంతో ఇటువంటి కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు కిమ్స్–ట్రస్ట్ ఆసుపత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ డాక్టర్ రవి సంతోష్, మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వినోద్ తెలిపారు. ఆసుపత్రికి వచ్చిన వారికి చికిత్స అందించడంతోనే కాకుండా ప్రజల మధ్యకు వెళ్లి ఆరోగ్యంపై అవగాహన పెంచడం కూడా ముఖ్యమన్నారు.
బోట్ క్లబ్ అధ్యక్షుడు అడబాల రత్న ప్రసాద్, కార్యదర్శి డాక్టర్ శ్రీధర్ దాసరి ఏర్పాట్లను పర్యవేక్షించారు. వాకర్స్ క్లబ్ సభ్యులు సహకరించారు. ప్రపంచ హృదయ దినోత్సవం వేళ ఆరోగ్యంపై వైద్యులు చెప్పిన మాటలు, అక్కడికక్కడే చేసిన పరీక్షలు వాకర్స్‌కు ఉపయోగపడే కార్యక్రమంగా నిలిచాయి.