BREAKING
టీనేజర్ల భద్రత కోసం వాట్సాప్ కీలక ఫీచర్: ఐచ్ఛిక ‘పేరెంటల్ కంట్రోల్స్’ ప్రవేశపెట్టిన మెటా ట్రంప్-మోదీ ఫోన్ సంభాషణ ‘అద్భుతం’: భారత్-అమెరికా బంధంపై అమెరికా రాయబారి ప్రశంసలు వినియోగదారులపై ధరల భారం: ఇండోర్‌లో నేటి నుంచి లీటరు పాలకు ₹3 పెంపు! జీ20 సదస్సు వేళ భారత్-పోలండ్ ద్వైపాక్షిక భేటీ: వాణిజ్యం, పెట్టుబడుల విస్తరణపై పీయూష్ గోయల్ కీలక చర్చలు భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి

గోసుపాటి నారాయణమ్మ నేత్రదానం – ఇద్దరు అంధులకు వెలుగు ప్రసాదించే అవకాశం

Select Suryaa Now
గోసుపాటి నారాయణమ్మ నేత్రదానం – ఇద్దరు అంధులకు వెలుగు ప్రసాదించే అవకాశం

ప్రొద్దుటూరు, మేజర్ న్యూస్ : 

ప్రొద్దుటూరు పట్టణం బాలాజీ నగర్ కి చెందిన గోస్పాటి నారాయణమ్మ (75) మరణించిన అనంతరం ఆమె కుటుంబ సభ్యులు నేత్రదానానికి అంగీకరించి మరోసారి సమాజానికి ఆదర్శంగా నిలిచారు. మృతురాలి కుమారుడు చంద్ర ఓబుల్ రెడ్డి, కోడలు కళావతి నేత్రదానానికి సమ్మతి తెలుపుతూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ మరియు పులివెందుల స్నేహిత అమృత హస్తం సేవాసమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షులు మొమ్మెల రాజుకు సమాచారం అందించారు. సమాచారం అందుకున్న వెంటనే నేత్ర సేకరణ కేంద్రం టెక్నీషియన్ అరవింద్ మృతురాలి నివాసానికి చేరుకుని పార్ధివ దేహం నుంచి రెండు కార్నియాలను సేకరించారు. అనంతరం వాటిని హైదరాబాద్‌లోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధికి తరలించినట్లు రాజు తెలిపారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ, “నేత్రదానం అనేది మరణానంతరం కూడా ఇతరుల జీవితాల్లో వెలుగు నింపే మహోన్నత దానం. గోస్పాటి నారాయణమ్మ కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం ఇద్దరు అంధులకు చూపును అందించే అవకాశం కల్పిస్తుంది. సమాజంలోని ప్రతి ఒక్కరూ నేత్రదానంపై అవగాహన పెంచుకుని తమ కుటుంబ సభ్యులతో ఈ విషయంపై చర్చించి ముందుకు రావాలి” అని పిలుపునిచ్చారు. అలాగే గోస్పాటి కుటుంబం గతంలో కూడా సేవాభావాన్ని చాటుకున్నదని ఆయన పేర్కొన్నారు. నారాయణమ్మ భర్త, డీసీసీ బ్యాంక్ విశ్రాంత అసిస్టెంట్ జనరల్ మేనేజర్ గోస్పాటి ఓబుల్ రెడ్డి 2016లో మరణించినప్పుడు నేత్రదానంతో పాటు కడప రిమ్స్‌కు శరీరదానం చేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఇప్పుడు నారాయణమ్మ మరణానంతరం కూడా కుటుంబ సభ్యులు నేత్రదానం చేయడం ద్వారా మానవతా విలువలకు నిదర్శనంగా నిలిచారని ప్రశంసించారు. ఈ సందర్భంగా గోస్పాటి నారాయణమ్మకు ఘన నివాళులు అర్పించిన పలువురు, ఆమె కుటుంబ సభ్యుల సేవాభావాన్ని అభినందిస్తూ మరెందరో నేత్రదానానికి ముందుకు రావాలని ఆకాంక్షించారు.ఈ సందర్బంగా నేత్రదానం చేసిన కుటుంబ సభ్యులకు బంధువులు, సన్నిహితులు, స్నేహ సేవాసమితి అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి,సేవాసమితి బృందం కృతజ్ఞత అభినందనలు తెలిపారు.