గంధం ఉత్సవల్లో.. బీవీ
దస్తగిరి స్వామి గంధం ఉత్సవాల్లో.. ఎమ్మెల్యే బీవీ
ఎమ్మిగనూరు,సూర్య ప్రతినిధి
గోనెగండ్ల మండల పరిధిలోని పెద్ద నెలటూరు, కులుమాల గ్రామాల్లో గురువారం శ్రీ దస్తగిరయ్య దర్గా గంధం మహోత్సవాల్లో ఎమ్మిగనూరు ఎమ్మెల్యే డాక్టర్ బి.వి. జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ముందుగా
పెద్ద నెలటూరుకు చేరుకున్న ఎమ్మెల్యేకు టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం దర్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిం చారు.
అనంతరం కులుమాల గ్రామంలో దస్తగిరయ్య దర్గాలో పూజలుచేశారు.కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ హెచ్. కైరవాడి, గోనెగండ్ల పీఏసీఎస్ అధ్యక్షుడు, టీడీపీ మండల అధ్యక్షుడు, కమిటీ సభ్యులు, మండల నాయకులు, గ్రామ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.