ఎన్నికల నిర్వహణపై ఏ ఎస్ పి చిన్ని కృష్ణ సమావేశం
మున్సిపల్, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై ఏ ఎస్పి చిన్నకృష్ణ సమావేశం
ఫోటో. సమావేశంలో మాట్లాడుతున్న ఏఎస్పి చిని కృష్ణ
ఆళ్లగడ్డ మేజర్ న్యూస్
రానున్న మున్సిపల్ ఎలక్షన్లను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు పోలీస్ యంత్రాంగం అందరు సమాయత్తం కావాలని నంద్యాల జిల్లా ఆర్మ్డ్ రిజర్వు విభాగం అడిషనల్ ఎస్పీ చిన్ని కృష్ణ సూచించారు.ఆళ్లగడ్డ లోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్లో సోమవారం సబ్ డివిజన్ పరిధిలోని హోమ్ గార్డులకు ఆయన రానున్న ఎన్నికల నిర్వహణపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ సునీల్ షోరాన్ ఆదేశాల మేరకు రానున్న స్థానిక సంస్థలు మున్సిపల్ ఎన్నికలలో ఏ ఒక్క చిన్న సమస్య తలెత్తకుండా శాంతిభద్రతల సంరక్షణలో ప్రతి ఒక్క సిబ్బంది భాగస్వాములు కావాలని ఏ ఎస్ పి చిన్ని కృష్ణ పిలుపునిచ్చారు. వారికి కేటాయించిన ప్రదేశాలలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన సూచించారు.ఈ సమావేశంలో రూరల్ సీఐ బివి రమణ, పట్టణ సీఐ నాగరాజ రావు పాల్గొన్నారు