BREAKING
ఎన్నికల విధులపై సిబ్బందికి దిశానిర్దేశం..!! హాంగ్ కాంగ్ సిక్సెస్ టోర్నమెంట్‌లో సంచలనం.. పాకిస్థాన్‌పై యూఏఈ సంచలన విజయం! పహాడిషరీఫ్ డివిజన్ బీసీలకు కేటాయించాలి పాఠశాలలో మద్యం సీసాలను పగలగొడుతున్న వైనం బంగారం పై రుణాలు అందించిన రౌతు నాగరాజు మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమాలే నా అసలు సిసలు గుర్తింపు.. సీనియర్ నటి జయసుధ ఆసక్తికర వ్యాఖ్యలు! బైక్ అదుపుతప్పి చెట్టును ఢీకొని వ్యక్తి మృతి టిడిపి అభ్యర్థులను గెలిపించాలంటూ ఇంటింటికీ ప్రచారం జోటా హెల్త్‌కేర్ క్యూ2 సమీక్ష: టార్గెట్ ప్రైస్‌ను తగ్గించినప్పటికీ 'బై' రేటింగ్ కొనసాగించిన నిర్మల్ బాంగ్.. పూర్తి వివరాలు ఇవే! పోస్టల్ బ్యాలెట్ కు విశేష స్పందన గోద్రేజ్ కన్స్యూమర్‌కు 25% అప్‌సైడ్: బ్రోకరేజ్ సవరించిన టార్గెట్ ధరలు వెంకటాపూర్‌–తెనుగూడ ప్రజలకు నీలిమ ఆస్పత్రి ఉచిత వైద్య సేవలు.. పల్లా దంపతుల చిత్రపటాలకు క్షీరాభిషేకం బ్రహ్మసముద్రంలో ప్రచారంలో దూసుకుపోతున్న తెలుగుదేశం పార్టీ. వాట్సాప్ గ్రూప్ చాట్లలో కొత్త ఫీచర్లు.. ఇక మెసేజ్‌లను ఈజీగా క్యాచ్-అప్ చేసుకోవచ్చు, ఎలా పనిచేస్తాయంటే! ప్రముఖ హాలీవుడ్ నటుడు పాట్రిక్ స్టీవ్‌వర్ట్ కన్నుమూత.. విషాదంలో సినీ లోకం!

ఎన్నికల బరి.. సాంకేతిక పై గురి

Select Suryaa Now
ఎన్నికల బరి.. సాంకేతిక పై గురి

ఆమదాలవలస, సూర్య :  స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చేనెల 5వ తేదీన జరగనున్న సందర్భంగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావడంతో గ్రామాల్లో అభ్యర్థుల ప్రచారం ముమ్మరంగా చేస్తున్నారు. ఎంపీటీసీ,జడ్పిటిసి అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు రకరకాల వ్యూహాలు రచిస్తున్నారు. సాంకేతిక ఆధారంగా ఓటర్లను ఆకట్టుకునేందుకు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. ఎన్నికల పోలింగ్ సమయం తక్కువగా ఉన్నందున ఎక్కువమంది ఓటర్లను కలిసేందుకు వీలు లేకపోవడంతో వాట్సాప్ ద్వారా తమ సందేహాలను పంపుతున్నారు. కాలానికి అనుగుణంగా వాట్సాప్ సంకేతంతో ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. గెలుపే లక్ష్యంగా తమ ప్రయత్నాలను ముమ్మరం చేస్తూ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తలతో బంధుమిత్రులకు, గ్రామస్తులకు వాట్సప్ చేస్తూ కొత్తగా గ్రూపులను క్రియేట్ చేస్తున్నారు. దీని ద్వారా విస్తృత ప్రచారం చేస్తూ ఎన్నికల బరిలో ఉన్నానని, మద్దతు ఇవ్వాలని, వీడియోలు, పోస్టర్లు పంపిస్తున్నారు. వాట్సాప్ ద్వారా చూసిన దూర ప్రాంతంలో ఉన్నవారు ఎన్నికల అభ్యర్థులతో మాట్లాడుతున్నారు. వాట్సప్ పై పట్టున్న అనుచరుల్ని అభ్యర్థులు ఎంపిక చేసుకుని అవసరమైన స్మార్ట్ ఫోన్లు, లాప్టాప్ లు అందిస్తూ వాటి ద్వారా వాట్సాప్ గ్రూపులకు ఎన్నికల సమాచారాన్ని అందించేందుకు కృషి చేస్తున్నారు. అధికార పార్టీకి చెందిన అభ్యర్థులు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి, ఇతర కార్యక్రమాల గురించి వివరిస్తూ వీడియోలు చేస్తూ వాట్సాప్ ద్వారా పంపిస్తున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన అభ్యర్థులు గతంలో చేపట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి గురించి ఈ వీడియోలు, బ్యానర్లు చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. ఇలా ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు గెలుపు కోసం సాంకేతికతను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసేందుకు రకరకాల కార్యక్రమాలు చేపడుతున్నారు. 
దీంతో పాటు సుదూర ప్రాంతాల్లో ఉన్న ఓటర్లకు అభ్యర్థులు తమ పార్టీ కార్యకర్తల ద్వారా ఫోన్ పే, గూగుల్ పే చేసి ఓటు వేయాలని అభ్యర్థిస్తున్నారు. గెలుపే లక్ష్యంగా అభ్యర్థులు తమ ఎన్నికల వేటను కొనసాగిస్తున్నారు. ఏది ఏమైనా ఆమదాలవలస మండలంలో గెలుపు కోసం ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు అహర్నిశలు శ్రమిస్తున్నారు.. ఇక గెలుపు ఎవరికి వరిస్తుందో వారం రోజులపాటు వేచి చూడాల్సిందే.