బండమీద పల్లి ఎస్ఎంసి కమిటీ సభ్యుల ఏకగ్రీవ ఎన్నిక
అనంతపురం బ్యూరో
బండమీదపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాల హైస్కూల్ కమిటీ చైర్మన్‌గా జి.లావణ్య, వైస్ చైర్మన్‌గా ఎం.లక్ష్మి ఏకగ్రీవ ఎన్నిక
శింగనమల మండలం బండమీదపల్లి గ్రామంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో హైస్కూల్ కమిటీ ఎన్నికలు ఏకగ్రీవంగా జరిగాయి.
ఈ ఎన్నికల్లో హైస్కూల్ కమిటీ చైర్మన్‌గా జి.లావణ్య, భర్త జి.రామాంజనేయులు, వైస్ చైర్మన్‌గా ఎం.లక్ష్మి, భర్త ఓబుల్‌పతి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన చైర్మన్ జి.లావణ్య, వైస్ చైర్మన్ ఎం.లక్ష్మికి బడమీద పల్లి తెలుగుదేశం పార్టీ నాయకుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలిపారు. పాఠశాల అభివృద్ధికి కమిటీ సభ్యులు సమన్వయంతో పనిచేయాలని ఆకాంక్షించారు.