BREAKING
గ్రామీణ మహిళలకు గీతం, ఫైజర్ సంయుక్త శిక్షణ కామ్రేడ్ కళ్యాణ్ పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్.. శ్రీవిష్ణు కామెడీతో కచ్చితంగా నవ్విస్తాడు: డైరెక్టర్ జనకిరామ్ మారెళ్ల తొలగించిన పారిశుద్ధ్య కార్మికులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: సిఐటియు యూఏడబ్ల్యూ ఎన్నికల రగడ...యూనియన్ నాయకత్వ ఎనిక కోసం మొదలైన ఓటింగ్ అతి సున్నిత పోలింగ్ కేంద్రాల పరిశీలన... జగన్ మోహన్ రెడ్డి ని కలిసిన ఆనం కుటుంబ సభ్యులు సర్పంచ్ ముద్ద రాములు మృతి తీరని లోటు : మంత్రి డాక్టర్ వాకిటి శ్రీహరి అశ్వారావుపేటలో 52వ తెలంగాణ రాష్ట్రస్థాయి జూనియర్ కబడ్డీ పోటీలు డా కరుణాకర్ కి ఘనసత్కారము పార్టీ ఎన్నుకున్న అభ్యర్థిని మెజార్టీతో గెలిపించాలి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైసీపీ సత్త చాటాలి గొంగటి రఘునాథరెడ్డి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే బాల్యానికి బాసటగా.. అంగన్‌వాడీ ఉత్సవం ఢిల్లీ చేరుకున్న సీఎం చంద్రబాబు విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ బిర్లను ఇండస్ట్రీస్‌కు... ప్రత్యేక 33 కేవీ ఫీడర్ పనులకు శ్రీకారం...

బీజేపీ శ్రేణులు సరళ్ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలి: ముమ్మన దేముడు

Select Suryaa Now
బీజేపీ శ్రేణులు సరళ్ యాప్‌ను సమర్థవంతంగా వినియోగించాలి: ముమ్మన దేముడు

పెందుర్తి, సూర్య : పార్టీ కార్యకర్తలు చేపట్టే ప్రతి కార్యక్రమం వివరాలను తప్పనిసరిగా 'సరళ్' యాప్‌లో అప్‌లోడ్ చేయాలని జీవీఎంసీ 95వ వార్డు మాజీ కార్పొరేటర్, బీజేపీ నాయకులు ముమ్మన దేముడు పిలుపునిచ్చారు. అనకాపల్లి జిల్లా పెందుర్తి నియోజకవర్గం చినముషీడివాడలోని పార్టీ కార్యాలయంలో 95, 97 వార్డుల బీజేపీ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. 95, 97 వార్డుల అధ్యక్షులు చిక్కాల సతీష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ముమ్మన దేముడుతో పాటు మండల సమావేశం ఇన్‌చార్జి, అనకాపల్లి జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు గొటివాడ సామ్రాట్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ముమ్మన దేముడు మాట్లాడుతూ... పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత సమర్థవంతంగా తీసుకెళ్లేందుకు ప్రతి కార్యకర్త చురుగ్గా నిరంతరం శ్రమించాలని కోరారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థుల విజయానికి శ్రేణులంతా సమన్వయంతో, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి బాధ్యతాయుతంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ 95, 97 వార్డుల యువమోర్చా అధ్యక్షుడు ఆదిరెడ్డి దేముడు బాబు, ఉపాధ్యక్షులు కె.వి.ఆర్. లక్ష్మి, పి.డి.వి. ప్రసాద్, ప్రధాన కార్యదర్శి రాపర్తి దుర్గా ప్రసాద్, సోషల్ మీడియా కన్వీనర్ కె.వి. సంతోష్ యాదవ్, కార్యదర్శులు భవాని, మణి, కాళ్ళ సురేష్, కొప్పల రామ ప్రభాకర్, గోవిందరావు యాదవ్, నాగరాజు, జగ్గునాయుడు, దార రామారావు, సత్యనారాయణ, మురళి, ప్రసాదరావు తదితరులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : నారాయణ, పెందుర్తి, విశాఖపట్నం.