BREAKING
రీజనల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌ను సందర్శించిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అభివృద్ధి పనులు, తాగునీటి సమస్యలపై మంత్రి నారాయణతో సమావేశం ఎమ్మెల్యే అశోక్ రెడ్డి పత్తి కొనుగోళ్లకు రంగం సిద్ధం చేయాలి.... జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ అంగన్వాడి సెంటర్లను సద్వినియోగం చేసుకోవాలి......... ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మ జా మా ఊరు దారిని మేము కాపాడుకుంటాం పొదలాడ ప్రజలు రాస్త రోకో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి ఎస్పీ జగదీష్‌ ఆదహళ్లి ఓటీటీలోనూ అదరగొడుతున్న బెత్లెహమ్ కుటుంబ యూనిట్.. ఏకంగా 5.4 మిలియన్ల వ్యూస్‌తో సరికొత్త రికార్డ్! అభివృద్ధి అవకాశాలను వెలుగులోకి తేవడమే ప్రాంతీయ సదస్సుల లక్ష్యం : రాష్ట్ర పరిశ్ర‌మ‌ల శాఖ ప్రిన్సిప‌ల్ సెక్ర‌ట‌రీ ఎన్. యువ‌రాజ్ మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన మంత్రి విశాఖను తూర్పు తీర ఆర్థిక ముఖద్వారంగా అభివృద్ధి చేస్తాం మోదీ గారి 25 ఏళ్ల పాలనా ప్రస్థానం భారత రాజకీయాల్లో నవశకం: ఎలక్షన్ కౌంటింగ్ సెంటర్స్ పరిశీలన కార్యక్రమము ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులకు కొత్త ఊపు విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేది టీచర్లే విశాఖ బీచ్‌లో విషాదం....ప్రాణాలు కోల్పోయిన నిజామాబాద్ యువకుడు.

అవినీతిని నిర్మూలించాలి : ఏపీజీ బి. మేనేజర్ శ్రీకాంత్

Select Suryaa Now
అవినీతిని నిర్మూలించాలి :  ఏపీజీ బి. మేనేజర్ శ్రీకాంత్

మెళియాపుట్టి, సూర్య : ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని నిర్మూలించేందుకు ప్రజల్లో చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని చాపర గ్రామీణ బ్యాంకు మేనేజర్‌ శ్రీకాంత్‌ అన్నారు. విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా బుధవారం చాపర గ్రామీణ బ్యాంకులో వినియోగదారులకు అవినీతి నిర్మూలనపై అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు చేయించుకునే సమయంలో లంచం ఇవ్వడం, తీసుకోవడం రెండూ చట్టరీత్యా నేరాలేనని స్పష్టం చేశారు.

అవినీతి వల్ల ప్రభుత్వ సేవలు, సంక్షేమ పథకాల ప్రయోజనాలు ప్రజలకు సకాలంలో అందకుండా పోయే అవకాశం ఉందన్నారు. లంచం డిమాండ్‌ చేసినా, ఎవరైనా అవినీతికి పాల్పడినా సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని సూచించారు. ప్రజలు తమ హక్కులు, ప్రభుత్వ సేవలపై అవగాహన పెంచుకోవడంతో పాటు అవినీతికి తావులేకుండా వ్యవహరించాలని కోరారు.

విజిలెన్స్‌ అవేర్‌నెస్‌ వీక్‌లో భాగంగా వారం రోజుల పాటు గ్రామాల్లో వివిధ అవగాహన కార్యక్రమాలు నిర్వహించి ప్రజలకు అవినీతి వల్ల కలిగే నష్టాలు, దాని నిర్మూలనకు తీసుకోవాల్సిన చర్యలపై వివరించనున్నట్లు మేనేజర్‌ తెలిపారు. బ్యాంకు సేవలు పొందే వినియోగదారులు కూడా ఎలాంటి అక్రమ చెల్లింపులకు పాల్పడకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

కార్యక్రమంలో బ్యాంకు క్యాషియర్‌ ఈశ్వర్‌, అకౌంటెంట్‌ మీనాక్షి, అసిస్టెంట్‌ షణ్ముఖ్‌, వినియోగదారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

 

రిపోర్టర్ : నాగిరెడ్డి, మెలియాపుట్ట,  శ్రీకాకుళం జిల్లా.