BREAKING
ఫ్లైదుబాయ్ విమానంలో పైలట్ల మధ్య ఘర్షణ: ధైర్యసాహసాలు చూపిన భారత పైలట్ స్మిత్ మచ్చర్‌కు సౌదీలో చికిత్స 'మ్యూజ్' గోప్యతా ఆరోపణలను ఖండించిన మెటా నేటి రాశి ఫలాలు : తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం సబ్‌జూనియర్ జాతీయ బాస్కెట్‌బాల్‌లో మహారాష్ట్ర, రాజస్థాన్ జోరు వాణిజ్య ఒప్పందంపై చర్చల కోసం సంయుక్త బృందాన్ని ఏర్పాటు చేయనున్న బ్రెజిల్, అమెరికా పోలీసు కుటుంబాల సమస్యలపై సమీక్ష ఐరోపా సమాఖ్య అత్యవసర డీజిల్ నిల్వల్లో సింహభాగం జర్మనీ, ఫ్రాన్స్‌ల వద్దే తునిలో యనమల ఇంట నేతల ఆత్మీయ సందడి నేటి పంచాంగం — తేదీ: 1 అక్టోబర్ 2026, గురువారం భూ రి సర్వేను పకడ్బందీగా నిర్వహించాలి యువత భక్తితో పాటు క్రమశిక్షణ అలవర్చుకోవాలి నేటి నుండి సమ్మేటివ్-1 పరీక్షలు టెస్లా ఆటోమేటిక్ ఓటింగ్ ప్రణాళికకు సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ ఆమోదం బందరు పోర్టు పరిసరాల్లో అక్రమ మైనింగ్‌కు చెక్ డ్రగ్స్‌ నిల్వ భవన నిర్మాణ పనుల పరిశీలన

అన్నదానం ప్రారంభించిన పువ్వాడి వెంకటేశ్వర్లు

Select Suryaa Now
అన్నదానం ప్రారంభించిన పువ్వాడి వెంకటేశ్వర్లు

పామూరు, మేజర్ న్యూస్ : నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలంలోని రామాపురంలో నిర్వహించే పల్లె పండుగ–3.0 బహిరంగ సభకు తరలివెళ్తున్న నాయకులు, కార్యకర్తల కోసం పామూరులోని పువ్వాడి రాధాకృష్ణ కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ పామూరు మండల మాజీ అధ్యక్షుడు పువ్వాడి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. సభకు వెళ్లే నాయకులు, కార్యకర్తలకు భోజన వసతి కల్పించాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి, భోజన ఏర్పాట్లను పరిశీలించారు. రామాపురం సభకు తరలివెళ్లే వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భోజన వసతి కల్పించడం కోసం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మేజర్ పంచాయతీ మాజీ ఉపసర్పంచ్ యాదాల వెంకట సాయి కిరణ్, టిడిపి విభిన్న ప్రతిభావంతుల రాష్ట్ర కార్యదర్శి అడుసుమల్లి ప్రభాకర్ చౌదరి, గుంటుపల్లి శ్రీనివాసులు, పువ్వాడి వెంకటేశ్వర్లు బిల్డర్, పువ్వాడి రామారావు, సయ్యద్ అమీర్ బాబు, ఇర్రి కోటిరెడ్డి, షేక్ గౌస్ బాషా, నాయబ్ రసూల్ తదితరులు పాల్గొన్నారు.