అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో వైఎస్సార్‌సీపీ నేతల పరామర్శ
అనంతపురం బ్యూరో: టీడీపీ కార్యకర్తల దాడిలో గాయపడి అనంతపురం ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి వరికూటి కాటమయ్య, ఆయన భార్యను వైఎస్సార్‌సీపీ నాయకులు పరామర్శించారు. ఆసుపత్రికి చేరుకున్న నాయకులు కాటమయ్య దంపతుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, వారికి ధైర్యం చెప్పారు.
ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర రైతు విభాగం ప్రధాన కార్యదర్శి బొమ్మని శ్రీరాం రెడ్డి, వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దె కుల్లాయప్ప, సింగనమల వైఎస్సార్‌సీపీ మాజీ సమన్వయకర్త ఎం. వీరాంజనేయులు, ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు సీనా నాయక్, తరిమెల భాస్కర్ రెడ్డి, రేకుల కుంట లక్ష్మీనారాయణ, నార్పల మిద్దె తిరుపాలు తదితరులు పాల్గొన్నారు.
కాటమయ్య దంపతులకు మెరుగైన వైద్యం అందించాలని, వారు త్వరగా కోలుకోవాలని నాయకులు ఆకాంక్షించారు.