BREAKING
బీజేపీ నేతలకు దసరా శుభాకాంక్షలు వెంగళరావు నగర్ కాలనీలో ఘనంగా రావణ దహన కార్యక్రమం ఎంపీ మల్లుకు శేరి దసరా శుభాకాంక్షలు శ్రీ షిర్డీ సాయిబాబా 108వ పుణ్యతిధి వేడుకలు ఘనంగా నిర్వహణ రష్మిక మందన్నతో ప్రేమ, పెళ్లి విషయాలపై విజయ్ దేవరకొండ ఆసక్తికర వ్యాఖ్యలు! డామా గ్యాస్ట్రో క్లినిక్ ప్రారంభోత్సవం ముఖ్యఅతిథిగా హాజరైన జనసేన రాష్ట్ర నాయకులు ముమ్మారెడ్డి ప్రేమకుమార్ కేసిఆర్ కు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కార్యక్రమంలో పాల్గొన్న కార్పొరేటర్లు కూకట్ పల్లి నియోజకవర్గ బిఆర్ఎస్ కోఆర్డినేటర్ రెడ్డి సతీష్ ఆరోరా తిరుపతి, చంద్రగిరిలో అరాచకాలకు పోలీసులే బాధ్యులు! –ఎస్పీ సుబ్బరాయుడును తక్షణమే సస్పెండ్‌ చేయాలి ఆర్‌సీ 17 సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతంపై క్లారిటీ ఇచ్చిన మైత్రీ రవిశంకర్! ఆరోగ్యకర జీవనశైలికి సమతుల్య ఆహారం ముఖ్యం: ఎస్.ఎం. వెల్ నెస్ సెంటర్ ప్రారంభోత్సవంలో మహిత స్వామి! కళ్ల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రతిరోజూ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? *కోహీర్ మండల సేవాదళ్ అధ్యక్షులు శ్రీనివాస్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్‌కు శాలువాతో సన్మానం* ఎముకల బలహీనతకు కేవలం కాల్షియం లోపమే కారణం కాదా? ఈ అనారోగ్య సమస్యలే అసలు ముప్పు! పోలీసు అమరవీరులకు ఘన నివాళులు   - జిల్లా ఎస్పీ తుషార్ డూడి - విధి నిర్వహణలో అశువులు బాసిన అమరవీరుల త్యాగాలు చిరస్మరణీయం ప్రీ-డయాబెటిస్ ఉంటే మధుమేహం ఖాయమా? అసలు నిజాలు మరియు నివారణ మార్గాలు!

అభివృద్ధిని గమనించండి…21వ డివిజన్ లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయండి

Select Suryaa Now
అభివృద్ధిని గమనించండి…21వ డివిజన్ లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేయండి

నెల్లూరు సిటీ మేజర్ న్యూస్ : నెల్లూరు నగర కార్పొరేషన్ ఎన్నికలు ఈ నెల 28న జరగనున్న నేపథ్యంలో, 21వ డివిజన్ జనసేన పార్టీ అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల విజయమే లక్ష్యంగా జనసేన నాయకులు గత నెల రోజులుగా నిర్వహిస్తున్న ఎన్నికల ప్రచారం ఆదివారం కూడా ఉత్సాహంగా కొనసాగింది. ఈ సందర్భంగా  “రెండున్నరేళ్ల కూటమి పాలనలో అభివృద్ధిని గమనించండి… ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తున్న కూటమికి మరో అవకాశం ఇవ్వండి. 21వ డివిజన్‌లో గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి విజయలక్ష్మి గునుకులను గెలిపించండి”  అంటూ జనసేన నాయకులు ప్రజలను అభ్యర్థించారు. ఈ ప్రచార కార్యక్రమంలో జనసేన నాయకులు కిషోర్ గునుకుల, కావలి జనసేన నాయకులు అలహరి సురాధర్ పాల్గొని, స్థానిక ప్రజలు, కుటుంబాలతో మమేకమై కూటమి అభ్యర్థులకు మద్దతుగా ఓటు వేయాలని కోరారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయాలతో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నెల్లూరు నగర కార్పొరేషన్‌లో అభివృద్ధికి దూరమైన అనేక ప్రాంతాలు, స్థానిక సమస్యలను దృష్టిలో ఉంచుకుని, రానున్న రోజుల్లో నగరాభివృద్ధికి కూటమి అభ్యర్థులు కృషి చేస్తారని తెలిపారు. నగరంలోని 72 డివిజన్లలో కూటమి అభ్యర్థులను, కూటమి మేయర్ అభ్యర్థి రూప్ కుమార్ గారిని గెలిపించడం ద్వారా నెల్లూరు నగర అభివృద్ధికి ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా 21వ డివిజన్‌లో జనసేన పార్టీ తరఫున పోటీ చేస్తున్న విజయలక్ష్మి గునుకులను ఆదరించి, గాజు గ్లాసు గుర్తుపై ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో 21వ డివిజన్ జనసేన అభ్యర్థి విజయలక్ష్మి గునుకుల, జనసేన నాయకులు కిషోర్ గునుకుల, అలహరి సురాధర్, ప్రశాంత్ గౌడ్ మడపర్తి, ప్రశాంత్ గౌడ్, వీరమహిళలు ఆమని, ప్రవల్లిక, సుప్రియ, విజయ, శ్రీలక్ష్మి, కృష్ణవేణి తదితరులతో పాటు జనసేన నాయకులు నాగేంద్ర బాలు, బాలాజీ, కృష్ణమోహన్ రెడ్డి, నరహరి, విశ్వనాథ్, సుమంత్, రాజేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు.