BREAKING
గంటవూరులో వనిత శ్రీధర్ నాయుడు ప్రచారం జోరు జమ్మూలో పాకిస్తానీయుల అక్రమ నివాసం: 65 మందిపై క్రైమ్ బ్రాంచ్ ఛార్జ్‌షీట్! బ్రోకర్ ట్రేడింగ్ టెర్మినళ్ల దుర్వినియోగానికి అడ్డుకట్ట: త్వరలో కఠిన నిబంధనలు తేనున్న సెబీ.. ఛైర్మన్ తుహిన్ కాంత పాండే కీలక ప్రకటన! నేటి పంచాంగం 25 అక్టోబర్ 2026 నేటి రాశి ఫలాలు –25 అక్టోబర్ 2026 అనివార్య కారణాలతో భారత్ పర్యటన రద్దు చేసుకున్న ఇరాన్ స్పీకర్ గలీబాఫ్: బెంగళూరు ట్రాఫిక్‌తో విసిగిపోయారా? రూ.3 లక్షల కార్ హ్యాక్‌తో నెటిజన్లను ఆశ్చర్యపరిచిన టెక్కీ ముంబై రెస్టారెంట్లపై ఎఫ్‌డీఏ కొరడా: ఒట్టోమన్ కేఫ్, భారత్ క్యాంటీన్ సహా 7 హోటళ్ల లైసెన్సులు రద్దు.. ఎఫ్‌1 యునైటెడ్ స్టేట్స్ గ్రాండ్ ప్రిక్స్ క్వాలిఫైయింగ్ లైవ్ స్ట్రీమింగ్: నవంబర్ 1న రాహుల్ గాంధీ ర్యాలీతో ఢిల్లీ మార్కెట్లకు రూ.10,000 కోట్ల దెబ్బ: కేరళ లోక్ భవన్ కిచెన్‌లో మాంసాహారంపై నిషేధం: బాధ్యతలు చేపట్టిన తొలిరోజే గవర్నర్ ఓం ప్రకాష్ మాథుర్ కీలక ఆదేశాలు.. ప్రోస్టేట్ క్యాన్సర్ కణతులను కరిగించే సరికొత్త ఔషధం: జాన్సన్ అండ్ జాన్సన్ 'JNJ-6143' ట్రయల్స్‌లో కీలక పురోగతి.. సౌదీ అరేబియాలో చిక్కుకున్న భారతీయ ఉమ్రా యాత్రికులకు కేంద్రం అండ: సంచాలన స్కూల్ ఆఫ్ డాన్స్ ఆధ్వర్యంలో మాస్టర్స్ ఎగ్జామినేషన్ కార్తీక్ సుబ్బరాజ్ 'డోరతీ' అరుదైన చిత్రం.. ట్రాన్స్‌జెండర్ల జీవితాలకు హ్యాపీ ఎండింగ్ ఇచ్చిన డైరెక్టర్!

ఆధ్యాత్మిక ప్రచారకులకు ఘన సత్కారం.మూడు దశాబ్దాలుగా భక్తిభావాన్ని పెంపొందిస్తున్న ఓం శక్తి సత్సంగం సేవలు అభినందనీయం.

Select Suryaa Now
ఆధ్యాత్మిక ప్రచారకులకు ఘన సత్కారం.మూడు దశాబ్దాలుగా భక్తిభావాన్ని పెంపొందిస్తున్న ఓం శక్తి సత్సంగం సేవలు అభినందనీయం.

అనపర్తి, మేజర్ న్యూస్. అనపర్తి పరిసర ప్రాంతాల్లో మూడు దశాబ్దాలకు పైగా ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తి కార్యక్రమాల ద్వారా ప్రజల్లో భక్తిభావాన్ని పెంపొందించడంలో ఓం శక్తి సత్సంగం అధ్యక్షులు మేడపాటి వెంకటరమణారెడ్డి (గురు భవాని), సత్తి రామారెడ్డి చేస్తున్న సేవలు అభినందనీయమని వ్యాపారవేత్త కర్రి సుధాకర్ రెడ్డి అన్నారు.

స్థానిక వీరుళ్లమ్మ అమ్మవారి ఆలయ సన్నిధిలో త్రిశక్తి పీఠం నిర్వాహకులు మేడపాటి రామకృష్ణారెడ్డి, శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతు స్వర్గీయ నల్లమిల్లి రామారెడ్డి సతీమణి చెల్లయమ్మ, కొత్తూరు గ్రామానికి చెందిన సత్తి ఆదిరెడ్డి–అరుణ దంపతులు, వారి కుమార్తె చిరంజీవి హేమ సాత్విక చేతుల మీదుగా అమ్మవారికి వివిధ ఫలాలు, పుష్పాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఆధ్యాత్మిక భక్తిగీతాలతో ఆలయ పరిసర ప్రాంతం భక్తిపారవశ్యంలో మునిగిపోయింది. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక రంగంలో సేవలందిస్తున్న ప్రచారకుల కృషిని కొనియాడుతూ వారిని సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఆధ్యాత్మిక భక్తులు గొలుగూరి సహదేవారెడ్డి–విజయలక్ష్మి దంపతులు, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత దాసరి నాగమణి–చిట్టిబాబు దంపతులు, సత్సంగ ప్రతినిధులు కర్రి శ్రీనివాస్ రెడ్డి, మణికంఠ, మహేష్, హనుమాన్, బాపిరెడ్డి, నాని తదితరులు పాల్గొన్నారు.