|
|
by Suryaa Desk | Sun, Sep 14, 2025, 06:03 AM
ఎమ్మెల్యేల ఫిరాయింపు అనేది స్పీకర్ పరిధిలోని అంశమని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి కాంగ్రెస్‌లో చేరిన పది మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయాలన్న బీఆర్ఎస్ డిమాండ్‌పై ఆయన స్పందిస్తూ, ఈ విషయాన్ని స్పీకర్ చూసుకుంటారని పేర్కొన్నారు.గాంధీ భవన్‌లో నిర్వహించిన యూత్ కాంగ్రెస్ స్థాయి విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు మానసికంగా ఒక్కటయ్యాయని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతిపై సీబీఐ విచారణ నుంచి తప్పించుకోవడానికి కేసీఆర్ బీజేపీ పెద్దల ముందు మోకరిల్లారని ఆరోపించారు. రాహుల్ గాంధీని ప్రధానిగా చేయడమే లక్ష్యంగా యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు పని చేయాలని ఆయన పిలుపునిచ్చారు.