|
|
by Suryaa Desk | Mon, Jul 28, 2025, 12:17 PM
పటాన్చెరు : మానసిక ప్రశాంతత కోసం ప్రతి ఒక్కరూ దైవ చింతనను అలవాటు చేసుకోవాలని.. నియోజకవర్గంలో నూతన దేవాలయాల నిర్మాణాలకు నిరంతరం సంపూర్ణ సహకార అందిస్తున్నామని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలో నూతనంగా నిర్మించిన శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి దేవాలయంలో ఆదివారం నిర్వహించిన విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవం కార్యక్రమానికి ఎమ్మెల్యే జి ఎం ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఆలయ నిర్మాణానికి ఉడతా భక్తిగా పది లక్షల రూపాయల విరాళం అందించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గం వ్యాప్తంగా ఇప్పటివరకు సొంత నిధులతో 200లకు పైగా దేవాలయాలు నిర్మించడంతోపాటు ప్రతి ఒక్కరిలో పరమత సహనం పెంపొందిస్తున్నామని తెలిపారు. నూతన దేవాలయాలకు సంపూర్ణ సహకారం అందిస్తున్నామన్నారు..