telangana
ఉత్కృష్ట సేవా పతకం కు ఎంపికైన ఇంటెలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట సాయి ప్రసాద్
సూర్య ఎల్లారెడ్డి : భారత ప్రభుత్వ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రదానం చేసే ప్రతిష్టాత్మక (ఉత్కృష్ట సేవా పతకం ) కు తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్ తోట. సాయి ప్రసాద్ ( హెచ్ సి 4564, ) ఎంపికయ్యారు.2000 బ్యాచ్ కు చెందిన తోట సాయి ప్రసాద్ గత 25 సంవత్సరాలుగా పోలీస్ శాఖలో మచ్చలేని సేవలందిస్తున్నారు. పోలీసు శాఖలో ఆయన చూపిన అంకితభావం, అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ఈ గౌరవ పతకాన్ని ప్రకటించింది. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి కి చెందిన కీర్తిశేషులు తోట పోచయ్య (ఆర్టీసీ కండక్టర్) తోట సావిత్రి దంపతులకు ముచ్చటగా ముగ్గురు సంతానం కూతురు భాగ్యలక్ష్మి ప్రైవేట్ టీచర్ రెండవ సంతానం తోట సాయిప్రసాద్ ఇంటిలిజెన్స్ హెడ్ కానిస్టేబుల్, మూడవ కుమారుడు ఎసిబి సర్కిల్ ఇన్స్పెక్టర్ తోట లింగమూర్తి. తోట సాయిప్రసాద్ చదువుతూ 2000 సంవత్సరంలో పోలీసు శాఖకు ఎంపికయ్యారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని అనంతపురం జిల్లాలో పోలీసు శిక్షణ పొందిన తోట సాయిప్రసాద్ పోలీసు సేవా యాత్ర ఇలా కొనసాగింది తన మొదటి సర్వీసును నిజామాబాద్ జిల్లా లోని డిచిపల్లి పోలీస్ స్టేషన్లో మొదటివ పోస్టింగ్ తో ప్రారంభించారు. అతని శ్రీమతి తోట రేణుక ప్రసాద్ రోడ్డు భవన శాఖ లో డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా మెదక్ జిల్లాలోని గజ్వేల్ లో విధులు నిర్వహిస్తున్నారు అనంతరం 2వ పోస్టింగ్ కార్ఖానా, పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్, 3వ పోస్టింగ్ గోపాలపురం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సికింద్రాబాద్, 4వ పోస్టింగ్ ట్రాన్స్ కో విజిలెన్స్ లలో విధులు నిర్వర్తించి, ప్రస్తుతం 5వ పోస్టింగ్ గా ఇంటెలిజెన్స్ విభాగంలో సేవలందిస్తున్నారు.ప్రతి పోస్టింగ్ లోనూ నిజాయితీ, క్రమశిక్షణ, ప్రజల పట్ల సేవా భావంతో పనిచేసినందుకు ఆయనకు ఉన్నతాధికారుల నుండి, ప్రజల నుండి అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. 2023లో రాష్ట్ర పోలీసు శాఖ సేవా పథకాన్ని అందజేసి నట్లు తెలిపారు.ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులు, తోటి సిబ్బంది, 2000 బ్యాచ్ మిత్రులు, గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తూ, మరిన్ని ఉన్నత పురస్కారాలు అందుకోవాలని ఆకాంక్షించారు. ఎల్లారెడ్డి పట్టణానికి చెందిన తోట సాయి ప్రసాద్ కు కేంద్ర ప్రభుత్వ హోం మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఉత్కృష్ట సేవ పథకం అవార్డు కు ఎంపికయ్యారు దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్ర పోలీసులు కేంద్ర సాయుధ పోలీసు బలగాలు రైల్వే ప్రొడక్షన్ ఫోర్స్ హోంగార్డులు సివిల్ డిఫెన్స్ విభాగాల్లో చేసిన అత్యుత్తమ సేవలకు గాను గుర్తింపుగా ఉత్కుష్ట సేవా పథకం కు ఎంపిక కావడం ఆనందంగా ఉందని ఆయన అన్నారు.