మండల పరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు బోర్డు ఏదీ?
సూర్య జైనూర్:కొమరం బీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండల కేంద్రంలోని మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం–2005కు సంబంధించిన బోర్డు ఏర్పాటు చేయకపోవడంతో కార్యాలయానికి వివిధ పనుల నిమిత్తం వస్తున్న అమాయక రైతులు, ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమాచార హక్కు చట్టం కింద దరఖాస్తు చేసుకోవాల్సిన విధానం, సంబంధిత అధికారుల వివరాలు తెలియక ప్రజలు అయోమయానికి గురవుతున్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రజలకు అవగాహన కల్పించాల్సిన సమాచార హక్కు చట్టం బోర్డు లేకపోవడంపై మండలవాసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి మండల ప్రజాపరిషత్ కార్యాలయంలో సమాచార హక్కు రక్షణ చట్టం–2005 బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలని జైనూర్ మండల ప్రజలు కోరుతున్నారు.