జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ తరలింపుపై నేడు బీజేపీ సన్నాహక సమావేశం.. ఎంపీ ఈటల రాజేందర్ హాజరు: ఏనుగు సుదర్శన్ రెడ్డి
మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ : జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను తరలించాలనే డిమాండ్‌తో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాల కార్యాచరణపై నేడు దమ్మాయిగూడలో సన్నాహక సమావేశం నిర్వహించనున్నట్లు మేడ్చల్ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏనుగు సుదర్శన్ రెడ్డి తెలిపారు.ఈ పరిణామాల నేపథ్యంపై అందుతున్న వివరాల ప్రకారం.. ఈ సమావేశానికి మల్కాజిగిరి ఎంపీ, బీజేపీ జాతీయ నాయకుడు ఈటల రాజేందర్ హాజరుకానున్నారని వెల్లడించారు.దమ్మాయిగూడలోని సాయి భవాని ఫంక్షన్ హాల్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం ప్రారంభం కానుంది. జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ కారణంగా పరిసర ప్రాంతాల ప్రజలు కాలుష్యం, దుర్గంధం, అనారోగ్య సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏనుగు సుదర్శన్ రెడ్డి పేర్కొన్నారు.డంపింగ్ యార్డ్‌ను మరో ప్రాంతానికి తరలించే వరకు బీజేపీ ఆధ్వర్యంలో పోరాటం కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
ఈ సన్నాహక సమావేశానికి బీజేపీ నాయకులు, కార్యకర్తలు, కాలనీ సంఘాల ప్రతినిధులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని ఏనుగు సుదర్శన్ రెడ్డి పిలుపునిచ్చారు