బైక్ అదుపుతప్పి యువకుడు మృతి.. మరొకరికి తీవ్ర గాయాలు
సూర్య చింతలమనేపల్లి.:కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానేపల్లి మండలం డబ్బా–బోధంపల్లి రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. డబ్బాలో నిర్వహించిన బతుకమ్మ సంబరాలను చూసి తిరిగి వెళ్తుండగా బైక్ అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు.ఈ ప్రమాదంలో గంగాపూర్ గ్రామానికి చెందిన అజయ్ మృతి చెందగా, ప్రేమ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. గాయపడిన ప్రేమ్ కుమార్‌కు చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. ప్రమాదానికి గల పూర్తి కారణాలు తెలియాల్సి ఉంది.ఈ ఘటనతో స్థానికంగా విషాదం నెలకొంది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.