నేడు సంగారెడ్డి జిల్లాలో ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన
సంగారెడ్డి, ; తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమం, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి సి. దామోదర్ రాజనర్సింహ శుక్రవారం సంగారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు మంత్రి కార్యాలయం పర్యటన షెడ్యూల్‌ను విడుదల చేసింది.షెడ్యూల్ ప్రకారం శుక్రవారం ఉదయం 10:30 గంటలకు హైదరాబాద్‌లోని ఎంఆర్‌సీ నుంచి రోడ్డు మార్గంలో బయలుదేరి, మధ్యాహ్నం 12 గంటలకు తద్దానపల్లిలోని ఎంఎస్ ఫంక్షన్ హాల్‌కు చేరుకోనున్నారు. అక్కడ నిర్వహించనున్న అలయ్ బలయ్ కార్యక్రమంలో మంత్రి పాల్గొననున్నారు.మంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన వసతి, ప్రోటోకాల్ ఏర్పాట్లు చేయాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌కు సూచించారు. అలాగే మంత్రి పర్యటన సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా భద్రత, ఎస్కార్ట్, బందోబస్తు ఏర్పాట్లు చేయాలని సంబంధిత పోలీసు అధికారులను ఆదేశించారు.మంత్రి పర్యటనకు సంబంధించిన తదుపరి కార్యక్రమాల వివరాలు ఇంకా వెల్లడికావాల్సి ఉంది.