BREAKING
హైదరాబాద్‌లో దక్షిణాది రాష్ట్రాల డీజీపీల సమన్వయ సదస్సు: ముఖ్య అతిథిగా సీఎం రేవంత్ రెడ్డి తిరుమలలో భక్తుల రద్దీ.. 26 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు ఈవిఎం ల భద్రతకు సంబంధించి ఎటువంటి నిర్లక్ష్యం ఉండకూడదు* *జిల్లా ఎన్నికల అధికారి/జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి నిర్భయంగా నామినేషన్లు వేయండి! ఆర్ ఓ ఎం.లక్ష్మయ్య ఏపీ మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ మార్పు: నవంబర్ 1న పోలింగ్, 3న ఫలితాలు ముష్టూరు ఎంపీటీసీ బరిలో మాలతి : జనసేన తరపున నామినేషన్ దాఖలు కట్టుదిట్టమైన భద్రతా నడుమ మూడవ రోజు నామినేషన్ల ప్రక్రియ! ఏపీకి మరో వాయుగుండం ముప్పు: ఆసియా మార్కెట్లలో టెక్ షేర్ల సునామీ: తీవ్రమైన నష్టాల్లో కోస్పి, నిక్కీ.. ఏఐ విలువలు, పెట్టుబడుల రాబడులపై పెరిగిన ఆందోళనలు! సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, అనవసర ఆందోళనలకు పాల్పడితే కేసులు తప్పవు అంతర్జాతీయ మార్కెట్లో రికార్డు స్థాయికి ముడిచమురు: బ్యారెల్ బ్రెంట్ క్రూడ్ $113 దాటి పరుగు.. వరుసగా మూడో వారం భారీ లాభాలు! గుడిసెల్లో నివసిస్తున్న వారికి, ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత. మంత్రి పొన్నం ప్రభాకర్ నేటి స్టాక్ మార్కెట్ ట్రేడ్ సెటప్: గిఫ్ట్ నిఫ్టీ సానుకూల సంకేతాలు, కీలక మద్దతు స్థాయిలు, క్యూ2 ఫలితాల షేర్లు.. అక్టోబర్ 23 ట్రేడింగ్‌కు పూర్తి గైడ్! నేటి స్టాక్ మార్కెట్ గైడ్: గిఫ్ట్ నిఫ్టీ జోరు, టెక్ షేర్ల సెల్‌ఆఫ్ నుంచి ముడిచమురు సెగ వరకు.. సెన్సెక్స్, నిఫ్టీ 50 గమనాన్ని నిర్దేశించే 5 కీలక అంశాలు! నేటి స్టాక్ మార్కెట్ ఫోకస్: స్విగ్గీ, హెచ్‌పీసీఎల్, సైయంట్, కోల్గేట్, ఈ-ముద్ర షేర్లలో కీలక కదలికలు.. క్యూ2 ఫలితాల ప్రభావం!

గుడిసెల్లో నివసిస్తున్న వారికి, ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత. మంత్రి పొన్నం ప్రభాకర్

Select Suryaa Now
గుడిసెల్లో నివసిస్తున్న వారికి, ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లలో మొదటి ప్రాధాన్యత. మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట: హుస్నాబాద్ నియోజకవర్గంలో పూర్తిగా ఇళ్లు లేని నిరుపేదలకు, గుడిసెల్లో నివసిస్తున్న వారికి ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపులో మొదటి ప్రాధాన్యత ఇస్తున్నట్లు రాష్ట్ర రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి, హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్  తెలిపారు.నియోజకవర్గంలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అర్హుల నుంచి డిమాండ్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో, అత్యంత దయనీయ పరిస్థితుల్లో నివసిస్తున్న వారికి ముందుగా న్యాయం చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రాధాన్యతా క్రమంలో ఇళ్లను కేటాయిస్తోందని పేర్కొన్నారు.అదేవిధంగా గౌరవెల్లి - గండిపల్లి ప్రాజెక్టు నిర్మాణం కారణంగా ఇళ్లు కోల్పోయి, ఇప్పటివరకు ఎలాంటి ఇల్లు పొందని నిర్వాసితుల్లో భూమి ఉండి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హత కలిగిన వారికి కూడా ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి వెల్లడించారు.కొత్తపల్లి నుంచి హుస్నాబాద్ వరకు నిర్మిస్తున్న నాలుగు వరుసల రహదారి విస్తరణలో భాగంగా చిగురుమామిడి, సుందరగిరి తదితర ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోయిన అర్హులైన కుటుంబాలకు కూడా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.అలాగే హుస్నాబాద్ పట్టణంలోని మల్లెచెట్టు చౌరస్తా నుంచి జనగామ మార్గంలో అక్కన్నపేట మీదుగా రహదారి విస్తరణ తదితర కారణాలతో ఇళ్లు కోల్పోయిన అర్హులైన వారికి సైతం ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు.హుస్నాబాద్ చౌటపల్లి వద్ద ఇండస్ట్రియల్ పార్క్ కోసం  భూములు ఇచ్చిన వారికి అర్హత ఉండి ఇల్లు లేని వారికి కూడా ఇందిరమ్మ ఇల్లు కేటాయించేల చర్యలు తీసుకుంటామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.

నిరుపేదలకు సొంతింటి కల నెరవేర్చడమే లక్ష్యం..

ఇళ్లు లేని నిరుపేదలకు, గుడిసెల్లో జీవనం సాగిస్తున్న కుటుంబాలకు, వివిధ అభివృద్ధి ప్రాజెక్టులు, రహదారి విస్తరణ కారణంగా నివాసాలను కోల్పోయిన అర్హులైన నిర్వాసితులకు న్యాయం చేయాలన్నదే తమ లక్ష్యమని మంత్రి పేర్కొన్నారు. అర్హుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ, అత్యంత అవసరంలో ఉన్న కుటుంబాలకు మొదటి ప్రాధాన్యతనిస్తూ, ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు.