ఏఎల్‌పీ గనిలో ప్రమాదం.. కార్మికుడి కుడిచేతి మణికట్టుకు ఫ్రాక్చర్
సూర్య, సెంటినరీకాలనీ :సింగరేణి సంస్థ ఏఎల్‌పీ గనిలో రూఫ్ బోల్టింగ్ పనులు నిర్వహిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు ఓ కార్మికుడు గాయపడ్డారు. బుధవారం 79 డిస్ట్రిక్ట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. రూఫ్ బోల్టింగ్ పనుల్లో నిమగ్నమైన కార్మికులు అంజయ్య చేతికి ధరించిన గ్లోవ్ డ్రిల్లింగ్ రాడ్‌లో చిక్కుకోవడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. ఈ ఘటనలో ఆయన కుడిచేతి మణికట్టు ఎముకకు ఫ్రాక్చర్ అయినట్లు తెలిసింది. ప్రమాదం జరిగిన వెంటనే అంజయ్యకు వైద్య చికిత్స అందించేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. గనుల్లో యంత్రాల వద్ద పని చేసే సమయంలో భద్రత నిబంధనలు, రక్షణ పరికరాల వినియోగం పై మరింత అప్రమత్తత అవసరమని ఈ ఘటన గుర్తుచేస్తోంది.