BREAKING
మోడల్ స్కూల్ క్రీడాకారిణులకు ఎంఈఓ అభినందన ఉద్యమకారుడికి కాంగ్రెస్‌లో కీలక బాధ్యత! దోమల నివారణకు గాంభూషియా చేపలు..! ఎంపీపీ, జడ్పీ పీఠాలకు ముహూర్తం ఫిక్స్! అమరవీరుల ఆశయాల సాధన కోసం ఉద్యమించాలి కాకినాడ జీజీహెచ్‌ను 3000 పడకల మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశగా ముందడుగు విశ్రాంత ఉద్యోగుల హక్కులకై అవిశ్రాంత పోరాడతాం. కాకాణికి ఘనంగా జన్మదిన శుభాకాంక్షలు *తీగలకుంటపల్లి రెడ్డి సంఘం నూతన  అధ్యక్షుడిగా మూల రాజిరెడ్డి ఏకగ్రీవంగా ఎన్నిక ఘనంగా మాజీ మంత్రి కాకాణి జన్మదిన వేడుకలు కుందారంలో ఉపాధి హామీ పనులు ప్రారంభం సిద్ధలకోనలో 167 నాగశిలల ప్రతిష్ఠా మహోత్సవం!12 రాశులకు అనుగుణంగా నాగదేవతల శిలలు.. ఏఐకేఎస్ మహాసభను జయప్రదం చేయండి జీఎంఆర్ ఐటీలో విద్యార్థుల విజ్ఞాన పర్యటన సిఆర్పి సంతోష్ ను పరామర్శించిన ఉపాధ్యాయులు

చిన్నారులు, మహిళలకు టీకాల ప్రాముఖ్యతపై IMA అవగాహన కార్యక్రమాలు

Select Suryaa Now
చిన్నారులు, మహిళలకు టీకాల ప్రాముఖ్యతపై IMA అవగాహన కార్యక్రమాలు

సూర్య కరీంనగర్ : వరల్డ్ ఇమ్యూనైజేషన్ డే సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) కరీంనగర్ ఆధ్వర్యంలో నగరంలోని వివిధ ఆసుపత్రుల్లో టీకాల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, కౌమార వయసు బాలబాలికలు, మహిళలకు అందించాల్సిన వివిధ రకాల టీకాలు, వాటి డోసులు, వాటి వల్ల కలిగే ప్రయోజనాలను పిల్లల వైద్యులు, స్త్రీ వైద్యులు, ఫిజీషియన్లు వివరించారు.శ్రీహీత పిల్లల ఆసుపత్రిలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ నార్ల మహేందర్ నవజాత శిశువు నుంచి కౌమార దశ వరకు ఇవ్వాల్సిన వివిధ రకాల టీకాల ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన IMA కార్యదర్శి డాక్టర్ చల్లూరి విజయ్ కుమార్ క్యాచ్ అప్ వ్యాక్సినేషన్ గురించి వివరించారు. నిర్ణీత వయసులో టీకాలు తీసుకోలేకపోయిన వారికి తదుపరి సమయంలో కూడా టీకాలు అందించడం ద్వారా వ్యాధుల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు.మరో అతిథిగా హాజరైన IMA ట్రెజరర్ డాక్టర్ ఆడెపు మానస హెచ్‌పీవీ (HPV) వ్యాక్సినేషన్‌తో పాటు గర్భిణీ స్త్రీలకు ఇవ్వాల్సిన టీకాలు, వాటి ప్రాముఖ్యతను వివరించారు.ఇదే తరహాలో పెటల్స్ నియో కేర్ హాస్పిటల్, సౌమ్య హాస్పిటల్, అమృత నర్సింగ్ హోమ్, ఫ్లోరెట్స్ చిల్డ్రన్ హాస్పిటల్‌లలో కూడా అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. టీకాలపై ప్రజల్లో అవగాహన పెంపొందించి, నివారించగల వ్యాధుల నుంచి చిన్నారులు, మహిళలను రక్షించడమే ఈ కార్యక్రమాల ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.