BREAKING
చిన్నారులను ఆశీర్వదించిన వడ్డేపల్లి సుభాష్ రెడ్డి ఓటీటీలోకి వచ్చేసిన మరో తెలుగు సినిమా.. సైలెంట్‌గా డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఐ యామ్ హ్యాండ్‌సమ్! భూసేకరణపై సమగ్ర విచారణ జరపాలి.. సీఎం జోక్యం చేసుకోవాలి: టీడీపీ రాష్ట్ర పొలిట్‌బ్యూరో సభ్యుడు బక్కని నర్సింహులు ఫామ్ పాండ్ల నిర్మాణంతో భూగర్భ జలాల పెంపు, రైతులకు అదనపు ఆదాయం - జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ పోలింగ్ సిబ్బంది కి 28న ఫెసిలిటేషన్ సెంటర్.. * జిల్లా కలెక్టర్ ఎస్. రాంసుందర్ రెడ్డి * ఓటీటీలో అలరిస్తున్న సరికొత్త మలయాళ థ్రిల్లర్ ధూమకేతు సినిమా పూర్తి రివ్యూ! నీటి సంరక్షణపై కూలీలకు అవగాహన శ్రీ కార్తిక్ దర్శకత్వంలో రుక్మిణి వసంత్ క్రేజీ ప్రాజెక్ట్.. ఆకట్టుకుంటున్న తారా అనౌన్స్‌మెంట్ వీడియో! పేరుకుపోతున్న చెత్త - డ్రైనేజీ నుంచి దుర్వాసన కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెబుదాం* - నగరాన్ని నాశనం చేసేందుకే బీజేపీ ఎత్తుగడలు - కూటమి ప్రభుత్వ ఆపద్దపు హామీలను నమ్మకండి - అనంతపురం నగరాన్ని కాపాడుకుందాం.. - వైసీపీ మేయర్ అభ్యర్థి రమేష్, సీపీఐ నాయకులు *పైడితల్లి అమ్మవారి ప్రసాదాల తయారీని పరిశీలించిన ఆహార భద్రతాధికారులు ప్రభుత్వ సలహాదారుని కృషితో ఆర్టీసీ బస్సు సౌకర్యం ఒక్క సినిమా విడుదల కాకుండానే మూడు అవకాశాలు.. టాలీవుడ్‌లో కేరళ భామ గహజీ హవా! తెలంగాణ కళాకారులకు సినీ రంగంలో అవకాశాలు కల్పించాలి సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయాలి - జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

భద్రతే అభివృద్ధికి పునాది

Select Suryaa Now
భద్రతే అభివృద్ధికి పునాది

అమీన్‌పూర్: భద్రతే అభివృద్ధికి పునాది అని, తెలంగాణ ప్రగతికి తెలంగాణ ప్రత్యేక రక్షణ దళం (టీజీఎస్‌పీఎఫ్‌) రక్షణ కవచంగా నిలుస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. అమీన్‌పూర్‌లో శుక్రవారం ఘనంగా నిర్వహించిన టీజీఎస్‌పీఎఫ్‌ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. 1991 అక్టోబర్ 23న ఏర్పాటైన ఈ దళం 36 ఏళ్లలో విశిష్ట సంస్థగా ఎదిగిందని కొనియాడారు.

ప్రస్తుతం తెలంగాణ సచివాలయం, శాసనసభ, హైకోర్టు, నాగార్జునసాగర్ ప్రాజెక్టు, ప్రధాన దేవాలయాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలతో పాటు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కీలకమైన 67 సంస్థలకు టీజీఎస్‌పీఎఫ్‌ రక్షణ కల్పిస్తోందని తెలిపారు. దాదాపు రెండు వేల మంది సిబ్బంది ఈ బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తున్నారని ప్రశంసించారు. 'ప్రగతికి రక్షణ' అనే దళం నినాదం ఎంతో అర్థవంతమైనదని, పెట్టుబడులు, పరిశ్రమల స్థాపనకు పటిష్టమైన భద్రత ఎంతో అవసరమని పేర్కొన్నారు.

ప్రత్యేకించి యాదాద్రి, కొత్తగూడెం, భద్రాద్రి వంటి విద్యుత్ ఉత్పత్తి కేంద్రాల వద్ద సిబ్బంది అందిస్తున్న సేవలు అభినందనీయమని విద్యుత్ శాఖ మంత్రి కూడా అయిన భట్టి విక్రమార్క పేర్కొన్నారు. విద్యుత్ వెలుగులు అందరికీ కనిపించినా, వాటి వెనుక భద్రతా సిబ్బంది చేసే కృషి వెలకట్టలేనిదని అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక నిఘా వ్యవస్థలు, డ్రోన్లు, కృత్రిమ మేధ, సైబర్ భద్రత వంటి సాంకేతిక పరిజ్ఞానంలో సిబ్బంది నిరంతరం నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. భద్రతా దళాల బలం కేవలం ఆయుధాల్లోనే కాక, సిబ్బంది క్రమశిక్షణ, నిజాయితీ, సమయస్ఫూర్తిలోనే ఉంటుందని స్పష్టం చేశారు. టీజీఎస్‌పీఎఫ్‌ సిబ్బంది సంక్షేమానికి, వారి వృత్తిపరమైన అభివృద్ధికి ప్రభుత్వం పూర్తి ప్రాధాన్యం ఇస్తుందని హామీ ఇచ్చారు.