BREAKING
దాడిలో గాయపడిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకు మాజీ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పరామర్శ... హిమాచల్ ప్రదేశ్‌లోని నహాన్‌లో రెండు వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ: అవధూత్ సాఠే ట్రేడింగ్ అకాడమీపై సెబీ కొరడా: రూ. 11.5 కోట్ల జరిమానా విధింపు.. బీపీసీఎల్ క్యూ2 ఆర్థిక ఫలితాలు: రూ. 4,993 కోట్ల నికర లాభంతో భారీ టర్న్‌అరౌండ్.. నష్టాల నుంచి బలంగా పుంజుకున్న ఎబిటా! కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలే అస్త్రంగా బీజేపీ అగ్రనేతల ఎదురుదాడి! పంజాబ్‌లో కొలిక్కివచ్చిన శిరోమణి అకాలీదళ్-బీజేపీ పొత్తు: సాగిలిటీ ఇండియా క్యూ2 ఫలితాల అంచనాలు బ్రేక్: డిఫెన్స్ స్టాక్స్‌కు సిస్టమాటిక్స్ 'బై' రేటింగ్: ఆస్ట్రా మైక్రోవేవ్, డాటా ప్యాటర్న్స్‌కు భారీ టార్గెట్లు.. ఏకంగా 68 శాతానికి పైగా లాభాల అంచనా! అదానీ గ్రీన్ ఎనర్జీ క్యూ2 సమీక్ష: పటిష్ట ఆర్థిక ఫలితాలతో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ బుల్లిష్.. 14 శాతం అప్‌సైడ్‌తో సవరించిన టార్గెట్ ప్రైస్ వివరాలు! కేఈఐ ఇండస్ట్రీస్ క్యూ2 ఫలితాలు: పీఎల్ క్యాపిటల్ బుల్లిష్ అవుట్‌లుక్.. బలమైన ఆర్డర్ బుక్‌తో వృద్ధిబాట. రష్యా-ఉక్రెయిన్ కాల్పుల విరమణ ఒప్పందం: యూఎస్ ప్రథమ మహిళ మెలానియా ట్రంప్ మధ్యవర్తిత్వంతో శాంతి ముందడుగు.. అమెరికా బాండ్ మార్కెట్లో అనూహ్య పరిణామం ఇన్ఫోసిస్ ఎఫ్‌వై27 ఆదాయ వృద్ధి అంచనాలకు కోత: 5.2 బిలియన్ డాలర్ల మెగా డీల్స్.. వాల్‌స్ట్రీట్‌లో టెక్ షేర్ల పునరుజ్జీవం: మైక్రాన్ 3.5 శాతం, ఎస్‌కే హైనిక్స్ 4.5 శాతం జంప్.. సౌదీ అరేబియాకు విమాన సర్వీసుల రద్దును పొడిగించిన ఆకాశ ఎయిర్..

అనుమతి రద్దు.. కళ్ల ముందే అక్రమ నిర్మాణం

Select Suryaa Now
అనుమతి రద్దు.. కళ్ల ముందే అక్రమ నిర్మాణం

కూకట్‌పల్లి, మేజర్ న్యూస్: అక్రమ నిర్మాణాలపై ప్రభుత్వం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా, క్షేత్రస్థాయిలో జీహెచ్‌ఎంసీ అధికారుల తీరు మాత్రం మారడం లేదు. అనుమతులు రద్దయిన స్థలాల్లోనూ ఏకంగా భారీ బహుళ అంతస్తుల భవనాలు కళ్లముందే వెలుస్తున్నా పట్టించుకోకపోవడం వెనుక పెద్ద ఎత్తున అవినీతి చోటుచేసుకుందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. కూకట్‌పల్లి సర్కిల్ 52 (గతంలో మూసాపేట్ సర్కిల్ 23) పరిధిలోని కె.పి.హెచ్.బి కాలనీ, ఫేజ్-1, రోడ్ నంబర్ 1, ప్లాట్ నంబర్ ఎంఐజి I - 194 (ఇంటి నంబర్: 15-24-194) వద్ద జరుగుతున్న అక్రమ నిర్మాణ వ్యవహారం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ స్థలానికి సంబంధించి యజమానులు స్టిల్ట్ ప్లస్ 2 అంతస్తుల నివాస భవనం (రెసిడెంటిల్  బిల్డింగ్) కోసం దరఖాస్తు చేసుకున్నారు. అయితే, జీహెచ్‌ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులు దరఖాస్తు పరిశీలించగా పలు తీవ్రమైన ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి.

 స్థలంలో ఇదివరకే ఉన్న పాత నివాసాన్ని (గ్రైండ్ + 1) పూర్తిగా కూల్చివేయకపోవడం ఇంక దానికి సంబంధించిన వివరాలు దాచడం. ప్లాట్ సరిహద్దులు (ప్లాట్ బౌండరీస్) సరిపోలకపోవడం. డెత్ సర్టిఫికెట్  పత్రాలు, వారసత్వ ధృవీకరణ వివరాలు నిబంధనల ప్రకారం సమర్పించకపోవడం. వీటి ఆధారంగా 24 ఏప్రిల్ 2024 నాడు లెటర్ నం. 380529 జిహెచ్ఎంసి/ 4434/2024 ద్వారా జీహెచ్‌ఎంసీ డెప్యూటీ కమిషనర్ ఈ భవన అనుమతిని పూర్తిగా రద్దు (రేవోకేడ్) చేశారు. నిర్మాణ పనులను తక్షణమే నిలిపివేయాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని  హెచ్చరించారు. ప్రభుత్వం ఇచ్చిన రద్దు ఉత్తర్వులను (రివొకేషన్ ఆర్డర్) కాగితాలకే పరిమితం చేస్తూ, నిర్మాణదారులు అడ్డూఅదుపు లేకుండా పనులు పూర్తిచేశారు. అనుమతులు పూర్తిగా రద్దయినప్పటికీ, ఏకంగా సెల్లార్, గ్రౌండ్ ప్లస్ 5 పై అంతస్తుల నిర్మాణం చేపట్టారు. కేవలం పార్కింగ్‌కు మాత్రమే కేటాయించాల్సిన స్టిల్ట్/గ్రౌండ్ ఫ్లోర్ ప్రాంతాన్ని వాణిజ్య (కమర్షియల్) అవసరాలకు ఉపయోగిస్తున్నారు. గతంలో అధికారులు నామమాత్రంగా కూల్చివేతలు జరిపినట్లు నటించినా, ఆ తర్వాత మళ్లీ నిర్మాణం ఇంత వేగంగా ఎలా పూర్తయిందనేది మిస్టరీగా మారింది.

సర్కిల్ - 52 అధికారుల పాత్రపై అనుమానాలు :కళ్లముందే ఎత్తైన బహుళ అంతస్తుల భవనం వెలుస్తుంటే టౌన్ ప్లానింగ్ అధికారులు (టిపిఎస్, టిపిఎస్ఓ), అసిస్టెంట్ సిటీ ప్లానర్ (ఏసీపీ), ఇంక డిప్యూటీ కమిషనర్ (డీసీ) ఏం చేస్తున్నారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. సర్కిల్ అధికారులకు భారీగా లంచాలు ముట్టజెప్పడం వల్లే ఈ అక్రమ నిర్మాణాన్ని చూసీచూడనట్లు వదిలేశారనే ఆరోపణలు స్థానికుల నుండి వస్తున్నాయి. అనుమతి రద్దు చేసిన తర్వాత క్షేత్రస్థాయి పరిశీలన చేయాల్సిన బాధ్యత మున్సిపల్ అధికారులపై ఉన్నప్పటికీ, వారు ఏమాత్రం పట్టించుకోకపోవడం వల్లనే ఈ మాఫియా రాజ్యమేలుతోంది.

భవిష్యత్తులో పొంచి ఉన్న తీవ్ర ముప్పులు :నిబంధనలకు విరుద్ధంగా, అనుమతులు లేకుండా నిర్మించిన ఇటువంటి అక్రమ కట్టడాల వల్ల భవిష్యత్తులో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం ఉంది. జీవన వ్యవస్థపై భారం పరిమితికి మించి అంతస్తులు నిర్మించడం వల్ల డ్రైనేజీ వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతుంది. అలాగే, పరిసర ప్రాంతాల్లో తీవ్రమైన మంచినీటి కొరత ఏర్పడే అవకాశం ఉంది. ఇరుకైన స్థలంలో 5 ప్లస్ అంతస్తులు కట్టడం వల్ల అత్యవసర సమయాల్లో ఫైర్ ఇంజిన్ లోపలికి వచ్చేందుకు కనీస సెట్‌బ్యాక్‌లు కూడా లేవు. ఏదైనా ప్రమాదం జరిగితే ప్రాణ, ఆస్తి నష్టం అపారంగా ఉంటుంది. పార్కింగ్ స్థలాన్ని కమర్షియల్ ప్రయోజనాలకు వాడటం వల్ల వాహనాలన్నింటినీ ప్రధాన రహదారిపైనే నిలపాల్సి వస్తుంది. దీనివల్ల కె.పి.హెచ్.బి రోడ్ నంబర్ 1 లో తీవ్ర ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతాయి. జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులు, ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ అక్రమ భవనంపై చట్టపరమైన కూల్చివేత చర్యలు చేపట్టాలి. అనుమతులు రద్దయిన భవనం పూర్తయ్యే వరకు నిర్లక్ష్యంగా వ్యవహరించిన, సూత్రధారులుగా ఉన్న సర్కిల్ - 52 టౌన్ ప్లానింగ్ అధికారులు, ఏసీపీ, డిప్యూటీ కమిషనర్లపై శాఖాపరమైన విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు, పౌర సమాజం డిమాండ్ చేస్తోంది.