BREAKING
ప్రభుత్వ కార్యాలయంలోనే దొంగతనం.. ఐరాస భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం తప్పనిసరి నల్ల సముద్రంలో నౌకాయాన స్వేచ్ఛకు భారత్ సహకారం స్లాఘనీయం హైదరాబాద్‌లో వినాయక నిమజ్జనంలో కలకలం.. కొండచిలువతో డాన్సులు చేసిన వైజాగ్ గ్యాంగ్ అరెస్ట్ అక్టోబర్ 16న రాజ్యసభ ఎన్నికలు: ఉత్తరప్రదేశ్‌లో 10, ఉత్తరాఖండ్‌లో 1 స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విద్యార్థి ఆత్మహత్య ఘటనతో ఐఐటీ బాంబే కీలక నిర్ణయం: హాస్టళ్లలో సీలింగ్ ఫ్యాన్ల స్థానంలో వాల్ మౌంటెడ్ ఫ్యాన్లు ప్రధాని మోదీ ప్రజా జీవితంలో 25 ఏళ్లు: మేడ్చల్‌లో బీజేవైఎం ఆధ్వర్యంలో భారీ రక్తదాన శిబిరం ఆదిలాబాద్ రిమ్స్‌లో తీవ్ర విషాదం.. ఏసీ పేలి ఐదు రోజుల శిశువు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం ప్రభుత్వ పాఠశాలల్లో పౌష్టిక అల్పాహారం! రూ.9 చీరల కోసం ఎగబడ్డ మహిళలు.. యాదాద్రి భువనగిరి జిల్లాలో మాల్ ఓపెనింగ్‌లో తోపులాట మచిలేస్వరి వీరభద్ర స్వామి టెంపుల్ దర్శించుకున్న ప్రభుత్వ విప్ దంపతులు అనంతారం బిక్కవాగు వంతెన పై రెండో రోజు కొనసాగుతున్న ఆమరణ నిరాహార దీక్ష.  రాబోయే దశాబ్ద కాలంలో భారత్ ఆర్థిక వ్యవస్థ మూడు రెట్లు పెరిగే అవకాశం: జేపీ మోర్గాన్ సీఈవో జేమీ డిమోన్ దివ్యాంగులకు చేయూత.. ఉపకరణాల గుర్తింపు హైదరాబాద్‌ మాదాపూర్‌లో ఓయో రూమ్‌లో యువతి హత్య, ప్రియుడు పరారీ

వినాయక స్వామి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలీ: యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి

Select Suryaa Now
 వినాయక స్వామి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలీ: యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి

శ్రీ వినాయక స్వామి ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలీ: యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆకాంక్షించారు.

వెలగలగూడెంలో ఘనంగా అన్నదాన కార్యక్రమం

వినాయక స్వామిని దర్శించుకున్న యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి

మునుగోడు,మేజర్ న్యూస్:

శ్రీ వినాయక స్వామి ఆశీస్సులు గ్రామ ప్రజలందరిపై ఉండాలని,ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని యువజన కాంగ్రెస్ నల్గొండ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి ఆకాంక్షించారు.
మండలంలోని వెలగలగూడెం గ్రామంలో సోమవారం రాత్రి పాల సెంటర్ వద్ద కొలువుదీరిన శ్రీ వినాయక స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమానికి గ్రామ ప్రజలు, భక్తులు, యువత పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై శ్రీ వినాయక స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. భక్తులకు స్వయంగా అన్నప్రసాదాన్ని అందిస్తూ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అన్నదాన కార్యక్రమానికి గ్రామ ప్రజలు, యువత, భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో పాల సెంటర్ పరిసరాల్లో పండుగ వాతావరణం నెలకొంది. భక్తిశ్రద్ధలతో గణనాథుని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నప్రసాద వితరణకు సహకరించిన దాతలు, యువత, గ్రామ పెద్దలు, భక్తులు, ప్రతి ఒక్కరికీ నిర్వాహకులు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. 
.