ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం
మోమిన్‌పేట్, మేజర్ న్యూస్( సెప్టెంబర్ 26):మండల స్థాయిలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికై 2026 ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు అందుకున్న ఉపాధ్యాయులను ఘనంగా సన్మానించారు. మోమిన్‌పేట్ మండల పరిధిలోని పాఠశాలల్లో విద్యార్థులకు ఉత్తమ బోధన అందిస్తూ సేవలందిస్తున్న ఉపాధ్యాయులను అభినందిస్తూ ఎంపీడీవో కార్యాలయంలో ఈ సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మర్పల్లి ఏఎంసీ చైర్మన్ వై. మహేందర్‌రెడ్డి, మేకవనంపల్లి పీఏసీఎస్ చైర్మన్ ఎం. శంకర్ యాదవ్, మండల పరిషత్ కార్యాలయ సూపరింటెండెంట్ రాజమల్లయ్య, సర్పంచుల సంఘం మండల అధ్యక్షుడు కోస్గి సురేందర్, మండల విద్యాధికారి నర్సింలు హాజరయ్యారు.ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి, వారి సేవలను అభినందించారు. విద్యార్థుల భవిష్యత్‌కు బాటలు వేస్తూ ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని వారు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, గౌరీశంకర్, ప్రభుతో పాటు ఉపాధ్యాయులు సమ్మయ్య, రాజు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.రిపోర్టర్ మాణిక్య చారి