BREAKING
ఓటీటీలో సంచలనం సృష్టిస్తున్న మలయాళ థ్రిల్లర్ 'ఒరు అన్వేషణతింటే తుడక్కమ్'.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? దమ్ముంటే రాహుల్‌గాంధీ గెలవాలి ప్రొద్దుటూరు టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా నంద్యాల రాఘవరెడ్డి! మిథున్ రెడ్డి పై డాడీ దారుణం. మాజీ ఎంపీ తలారి రంగయ్య. దసరా మహోత్సవానికి బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి కి ఆహ్వానం శ్రీ దుర్గా దేవి అమ్మవారి వద్ద కుంకుమర్చన, అక్షరాబ్యాస పూజలు కడప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేయర్ బట్టిగా నామినేషన్ దాఖలు చేసిన బండి దీప్తి స్థానిక ఎన్నికల్లో బీజేపీకి తగిన ప్రాతినిధ్యం కల్పించాలి ఎమ్మెల్యే బుద్ధప్రసాద్, టీడీపీ ఇన్‌ఛార్జి విక్కుర్తి శ్రీనివాసరావులకు బీజేపీ నాయకుల వినతి రాప్తాడు ఎంపీపీ పీఠంపై టీడీపీ నేతల గురి! ఆరుగురు ఆశావహుల మధ్య పోటీ.. అభ్యర్థి ఎంపికపై అధిష్ఠానం కసరత్తు వెలుగురాళ్ల తండాలో తుల్జా భవానీ నూతన దేవాలయ ప్రారంభం* దుర్గమ్మ ఆశీస్సులతో ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలి - లక్ష్మీ నర్సింహ రెడ్డి సెవెన్ హిల్స్ ఛానల్ కార్యాలయం పై దాడి రుద్ర సెక్యూరిటీ కాంట్రాక్టు రద్దు చేయాలి జూనియర్ సివిల్ జడ్జిగా వేముల హారిక ఎంపిక… - హారికకు ప్రభుత్వ విప్ విజయరమణారావు సన్మానం డిఎస్పి సూచనలు, ఆదేశాలు పటిష్ఠమైన జాగ్రత్తలు.

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు

Select Suryaa Now
సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారులు

చేర్యాల : తొలి, మలిదశ తెలంగాణ ఉద్యమకారులను గుర్తించేందుకు ప్రత్యేక వెబ్ సైట్ ను ఏర్పాటు చేయడంపై చేర్యాల మండల ఉద్యమకారులు హర్షం వ్యక్తం చేస్తూ సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా శుక్రవారం పాత బస్టాండ్ వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1969తొలిదశ, మలిదశ ఉద్యమకారులు ప్రాణాలను లెక్కచేయకుండా పోరాడి జైలు నిర్బంధాలు, అక్రమ కేసులను ఎదుర్కొన్నారని, గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉద్యమకారులను ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక చొరవ తీసుకొని కేకే కమిటీని ఏర్పాటు చేసి ఉద్యమకారుల సంక్షేమం, గుర్తింపు కోసం వెబ్ సైట్ ను ప్రారంభించడం అభినందనీయమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, కేకే కమిటీకి ఉద్యమకారుల ఫోరం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్ష, కార్యదర్శులు అంబటి అంజయ్య గౌడ్, అందె అశోక్, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ పుర్మ ఆగంరెడ్డి, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్ ఆడెపు చంద్రయ్య,చేర్యాల మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బోయిని శ్రీనివాస్, మాజీ జెడ్పీటీసీ కొమ్ము నర్సింగరావు, డైరెక్టర్ పచ్చిమడ్ల వెంకటయ్య, మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ కాటం మల్లేశం, మొహమ్మద్ ఖాజ, పాల సాయిలు, అంబాల రాములు, తాటిపాముల పర్శరాములు, పచ్చిమడ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.