telanagana
దమ్ముంటే రాహుల్గాంధీ గెలవాలి
సూర్య ప్రతినిధి, హైదరాబాద్: ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియతో సంబంధం లేకుండానే గతంలో తమ పార్టీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించిందని, దేశంలోని అనేక రాష్ట్రాల్లో కూడా ఎలాంటి ఎస్.ఐ.ఆర్ లేకుండానే బీజేపీ గెలిచిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ, ఆ పార్టీ నాయకుడు రాహుల్ గాంధీ వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
ఓట్ల చోరీ జరిగింది అనడంలో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసిన కిషన్ రెడ్డి, "ఓట్ల చోరీ జరగలేదు.. ప్రజలు కేవలం చోరులకే ఓట్లేయడం లేదు" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వ్యవస్థను, తీర్పును ప్రశ్నించడం మాని, నిజంగా దమ్ముంటే రాహుల్గాంధీ ప్రజాక్షేత్రంలో, ఎన్నికల్లో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. ఓటమికి నైతిక బాధ్యత వహించకుండా ప్రతిసారీ వ్యవస్థలపై నిందలు వేయడం కాంగ్రెస్కు అలవాటుగా మారిందని ఆయన విమర్శించారు.