సూర్య, మందమర్రి: మందమర్రి పట్టణ ముదిరాజ్ కుల సంఘం నూతన నాయకత్వాన్ని ఎంపిక చేశారు. సంఘాన్ని బలోపేతం చేయడంతోపాటు కులస్తుల అభ్యున్నతికి కృషి చేసే లక్ష్యంతో నెల్లి రాజలింగు ముదిరాజ్ను పట్టణ అధ్యక్షుడిగా, కట్ల శ్రీనివాస్ ముదిరాజ్ను ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఈ మేరకు మంచిర్యాల జిల్లా ప్రతినిధులు గరిగంటి కొమురయ్య, యువజన అధ్యక్షుడు గరిగె సుమన్ నియామక పత్రాలను అందజేశారు. తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ కులపెద్దల ఆదేశాల మేరకు మంచిర్యాల జిల్లాలోని పట్టణాలు, గ్రామాల్లో పాత కమిటీలను రద్దు చేసి నూతన కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ ప్రక్రియలో భాగంగా మందమర్రిలో కులస్తుల అభిప్రాయాలను సేకరించి నూతన బాధ్యులను ఎంపిక చేశారు. నూతన అధ్యక్షుడు, ప్రధాన కార్యదర్శి ఆధ్వర్యంలో పట్టణానికి పూర్తిస్థాయి కమిటీని ఏర్పాటు చేయాలని జిల్లా ప్రతినిధులు సూచించారు. ముదిరాజ్ కుల సంఘం అభివృద్ధితోపాటు సభ్యుల సంక్షేమం, సామాజిక ఐక్యత కోసం బాధ్యులు సమష్టిగా పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ కులస్తులు పాల్గొన్నారు.