BREAKING
అమెరికాలో ముగ్గురు పాలస్తీనా విద్యార్థులపై కాల్పుల కేసు: నిందితుడు జాసన్ ఈటన్ దోషిగా నిర్ధారణ బ్రెజిల్ అధ్యక్ష ఎన్నికల సర్వేల్లో తీవ్ర ఉత్కంఠ: లూలా, ఫ్లావియో బోల్సోనారో మధ్య హోరాహోరీ పోరు ముడి చమురు ధరల తగ్గడంతో లాభాల్లో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు 24/7 స్ట్రీమింగ్ వేదికగా ‘ట్రంప్ టీవీ’ ప్రారంభం పశ్చిమాసియాలో ముదురుతున్న ఉద్రిక్తతలు: సరిహద్దుల్లో మోహరింపులు.. అంతర్జాతీయ సమాజం తీవ్ర ఆందోళన మధ్యప్రాచ్యం నుంచి అమెరికా, ఇజ్రాయెల్ తక్షణమే వైదొలగాలి: ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ తీవ్ర హెచ్చరిక సరఫరా ఆటంకాల వల్లే రష్యా నుంచి ముడి చమురు దిగుమతులు: రాయితీలు ప్రధాన కారణం కాదన్న తాజా నివేదిక సమయస్ఫూర్తితో స్పందించిన 108 సిబ్బంది ఆసియా క్రీడలు: త్రీసా-గాయత్రి జోడీ అద్భుత విజయం.. మహిళల బ్యాడ్మింటన్ క్వార్టర్స్‌లో భారత్ ఆశలు సజీవం దక్షిణ కొరియాను చిత్తు చేసిన భారత కబడ్డీ జట్టు.. విసెగ్రాడ్-4 దేశాలతో భారత్ తొలి విదేశాంగ మంత్రుల భేటీ: 'చారిత్రక ఘట్టం'గా అభివర్ణించిన ఎస్. జైశంకర్ యూఎన్‌జీఏ వేదికగా భారత దౌత్యం: పలు దేశాల విదేశాంగ మంత్రులతో ఎస్. జైశంకర్ కీలక ద్వైపాక్షిక చర్చలు ఇజ్రాయెల్ దురాక్రమణ చర్యలను అడ్డుకోవాలి: ప్రపంచ దేశాల ఉమ్మడి మద్దతు కోరిన టర్కీ అధ్యక్షుడు ఎర్డోగాన్ అమెరికా, ఇజ్రాయెల్ నౌకలు, స్వాధీనం చేసుకున్న సరుకులు అమ్మకానికి సిద్ధం: ఇరాన్ న్యాయాధికారి సంచలన ప్రకటన శిథిలాలు, గుడారాల మధ్య తరగతి గదులు: మూడేళ్ల తర్వాత బడిబాట పట్టిన గాజా చిన్నారులు

సమయస్ఫూర్తితో స్పందించిన 108 సిబ్బంది

Select Suryaa Now
సమయస్ఫూర్తితో స్పందించిన 108 సిబ్బంది

 

యువతికి తప్పిన ప్రాణాపాయం 

మేడ్చల్ ,మేజర్ న్యూస్,(సెప్టెంబర్ 22): శామీర్‌పేట మండలం మజీద్‌పూర్ గ్రామంలో ఆత్మహత్యకు ప్రయత్నించిన 18 ఏళ్ల యువతిని సకాలంలో గుర్తించి, 108 సిబ్బంది సమయస్ఫూర్తితో స్పందించడంతో ప్రాణాపాయం తప్పింది. గ్రామానికి చెందిన మంజుల, నరసింహుల కుమార్తె రొండ్ల భావన (18) మంగళవారం సాయంత్రం సుమారు 7.30 గంటల సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.భావనను గమనించిన తల్లిదండ్రులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. సమాచారం అందిన వెంటనే శామీర్‌పేట 108 అంబులెన్స్ సిబ్బంది ఈఎంటీ యాదమ్మ, పైలట్ శాంతికుమార్ హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. డాక్టర్ చక్రవర్తి సూచనల మేరకు యువతికి అక్కడికక్కడే ప్రథమ చికిత్స అందించి, తదుపరి వైద్య చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.సకాలంలో 108 సిబ్బంది స్పందించి అత్యవసర వైద్య సహాయం అందించడంతో భావనను సురక్షితంగా ఆసుపత్రికి తరలించగలిగామని కుటుంబ సభ్యులు తెలిపారు. తమ కుమార్తెను కాపాడేందుకు వెంటనే స్పందించిన ఈఎంటీ యాదమ్మ, పైలట్ శాంతికుమార్‌కు భావన తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు.ఆపద సమయంలో ఒక్క ఫోన్‌కాల్‌తో స్పందించి అత్యవసర వైద్య సేవలు అందిస్తున్న 108 సిబ్బంది సేవల ప్రాధాన్యతను ఈ ఘటన మరోసారి చాటిచెప్పింది.