BREAKING
కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ప్రతి ఒక్క నిరుపేద కుటుంబానికి సంక్షేమ పథకాలు.. ఢిల్లీలో హిందూ కాలేజీ విద్యార్థినులను వేధించిన ఇద్దరు యువకుల అరెస్ట్.. ఎస్‌యూవీ వాహనం సీజ్ చిన్నారిపై అఘాయిత్యం, హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు.. పకడ్బందీ వాదనలు వినిపించిన పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ రవీందర్‌కు డీసీపీ సన్మానం ఒక ఉగ్రవాద దేశం నన్ను ఆ ప్రశ్న అడుగుతోంది.. ఐక్యరాజ్యసమితిలో పాక్ జర్నలిస్ట్‌కు విదేశాంగ మంత్రి జైశంకర్ దిమ్మతిరిగే కౌంటర్ గణనాథుడికి ఘన వీడ్కోలు కలెక్టరేట్ ప్రారంభోత్సవానికి పకడ్బందీ ఏర్పాట్లు మృత్యుకుహరాల్లా మారిన పరవాడ – సబ్బవరం రహదారి: ఆకట్టుకుంటున్న ఆర్యన్ గౌర, మోనిషా మోహన్ మేనన్ '#JAAN' ఫస్ట్ లుక్ పోస్టర్.. జీవీ ప్రకాష్ కుమార్ మ్యూజిక్! గణనాథుని కృపతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలి అథ్లెటిక్స్‌లో భారత్‌కు మిశ్రమ ఫలితాలు.. పతకాలతో అదరగొట్టిన గుల్‌వీర్, మన్‌ప్రీత్, బరణిక! ధారూర్ అభివృద్ధికి రూ.8.40 కోట్ల రోడ్డు నిధులు 12 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత మన్‌ప్రీత్ కౌర్‌కు ఏషియన్ గేమ్స్ పతకం.. ఇక ముందూ పరుగులే లక్ష్యం! తెలంగాణవ్యాప్తంగా ఘనంగా ముగిసిన వినాయక చవితి వేడుకలు.. వేలాది గణనాథుల నిమజ్జనం బోధన్‌లో రూ.5.10 లక్షలకు లడ్డూ వేలం 52 అడుగుల భారీ మహా గణపతి నిమజ్జనం పూర్తి.. నిర్దేశిత ప్రదేశంలో వైభవంగా వీడ్కోలు!

ప్రకృతి వ్యవసాయంలో జగిత్యాల జిల్లాను ముందంజలో నిలిపేందుకు సఖీలు కృషి చేయాలి

Select Suryaa Now
ప్రకృతి వ్యవసాయంలో జగిత్యాల జిల్లాను ముందంజలో నిలిపేందుకు సఖీలు కృషి చేయాలి

 

 మేడిపల్లి శిక్షణలో జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్

 కృషి సఖిలకు 5రోజుల శిక్షణ కార్యక్రమం..


సూర్య మేడిపల్లి:

ప్రకృతి వ్యవసాయంలో జగిత్యాల జిల్లాను ముందంజలో నిలిపేందుకు సఖీలు సమర్థవంతంగా కృషి చేయాలని  జిల్లా వ్యవసాయ శాఖ అధికారి భాస్కర్ తెలిపారు.జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని రైతు వేదికలో కృషి సఖిలకు 5రోజుల శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా వ్యవసాయ అధికారి వి.భాస్కర్ ప్రారంభించారు.ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ జగిత్యాల జిల్లాలో నేషనల్ మిషన్ ఆన్ నేచురల్ ఫార్మింగ్ కార్యక్రమం ద్వారా 2,875మంది రైతులను,46మంది కృషి సఖిలను,23క్లస్టర్లలో అనుసంధానం చేసి ప్రకృతి వ్యవసాయంపై అవగాహన,శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.ఒక్కో క్లస్టర్‌లో సుమారు 125మంది రైతులను గుర్తించి,వారికి ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నట్లు వివరించారు.ఈ 5రోజుల శిక్షణలో మట్టి నాణ్యత పరీక్షలు, ప్రకృతి వ్యవసాయంలో ఉపయోగించే జీవామృతం,బీజామృతం, ఘనజీవామృతం,నీమాస్త్రం, అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం,దశపర్ణి కషాయం వంటి ద్రావణాలు,కషాయాల తయారీ, వినియోగ విధానాలను కృషి సఖిలకు వివరించారు. అలాగే ప్రకృతి వ్యవసాయం,సేంద్రియ వ్యవసాయం మధ్య ఉన్న తేడాలను కూడా వివరించారు.ప్రతి కృషి సఖి గ్రామస్థాయిలో రైతులతో సమన్వయం చేసుకుంటూ ఎన్ ఎం ఎఫ్ పథకం లక్ష్యాలు,ప్రకృతి వ్యవసాయ పద్ధతులు,వాటి ప్రయోజనాలను రైతులకు చేరవేయాలని జిల్లా వ్యవసాయ అధికారి సూచించారు.డిప్యూటీ డైరెక్టర్ సుధాకర్ భూమిలోని 16ముఖ్యమైన పోషక మూలకాల గురించి కృషి సఖిలకు వివరించారు.జిల్లా నేచురల్ ఫార్మింగ్ నోడల్ ఆఫీసర్ ఎస్. శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయ పద్ధతుల ద్వారా భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంచి నేల నాణ్యతను, సారవంతతను మెరుగుపరచవచ్చని తెలిపారు. గోమయం, జీవామృతం, ఘనజీవామృతం వంటి సహజ ఇన్‌పుట్ల వినియోగం ద్వారా నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచే విధానాలను వివరించారు. అలాగే కృషి సఖిల విధులు, బాధ్యతలు, కృషి మ్యాప్ యాప్‌లో పంటల నమోదు, ఫీల్డ్ డెమో కార్యక్రమాల గురించి వివరించారు.ఈ సందర్భంగా జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ కార్యదర్శి పెండ్లి సంపత్ కుమార్ మాట్లాడుతూ ఐదు రోజుల శిక్షణను కృషి సఖిలు సద్వినియోగం చేసుకొని,శిక్షణలో నేర్చుకున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను గ్రామస్థాయిలో రైతులకు చేరవేయాలని సూచించారు. రైతులు తక్కువ ఖర్చుతో,నేల ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ప్రకృతి వ్యవసాయాన్ని అవలంబించేలా కృషి సఖిలు అవగాహన కల్పించాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో మేడిపల్లి మండల వ్యవసాయ అధికారి షహీద్,కృషి సఖిలు, జన వికాస గ్రామీణ అభివృద్ధి సంస్థ ప్రోగ్రాం కోఆర్డినేటర్ పెసరి రాజు తదితరులు పాల్గొన్నారు.