పరిగికి కొత్తగా సివిల్ కోర్టు మంజూరు
*పరిగి ఎమ్మెల్యే టీఆర్ఆర్.…
*ఎమ్మెల్యేను సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు…
పరిగి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 25). పరిగికి సివిల్ కోర్టు మంజూరు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం అధికారిక ఉత్తర్వులు జారీ చేసిందని పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి. రాం మోహన్ రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం జి.ఓ.ఎంఎస్.నం.59, తేదీ 24-09-2026 ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 200 కొత్త అదనపు జూనియర్ సివిల్ జడ్జి-కమ్-అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ కోర్టులకు మంజూరు చేశారని ఇందులో వికారాబాద్ జిల్లాలో పరిగికి సివిల్ కోర్టు మంజూరైనట్లు పేర్కొన్నారు. పరిగికి సివిల్ కోర్టు మంజూరు కావడం న్యాయవాదుల కృషికి, ప్రజల ఆకాంక్షకు లభించిన ముఖ్యమైన ఫలితం అన్నారు. కోర్టు అందుబాటులోకి రావడం ద్వారా పరిగి నియోజకవర్గ ప్రజలకు న్యాయ సేవలు మరింత చేరువ కానున్నాయి. అదే సమయంలో స్థానిక న్యాయవాదులకు కూడా తమ వృత్తిపరమైన కార్యకలాపాలను పరిగిలోనే కొనసాగించేందుకు మరింత అనుకూల వాతావరణం ఏర్పడనున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరిగిలో సివిల్ కోర్టు కోసం ఎన్నో సంవత్సరాలుగా కృషి చేస్తున్న పరిగి బార్ అసోసియేషన్ న్యాయవాదులకు ఈ సందర్భంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. పరిగికి సివిల్ కోర్టు మంజూరు కావడం పరిగి ప్రజలకు, ముఖ్యంగా న్యాయవాదులకు ఎంతో సంతోషకరమైన విషయం అన్నారు. పరిగి ప్రజలకు న్యాయ సేవలు మరింత సులభంగా అందుబాటులోకి రావడానికి ఈ కోర్టు మంజూరు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కు న్యాయవాదుల తరఫున, పరిగి ప్రజల తరపున కృతజ్ఞతలు తెలిపారు.
*ఎమ్మెల్యేను సన్మానించిన బార్ అసోసియేషన్ సభ్యులు…
పరిగికి కొత్తగా సివిల్ కోర్టు మంజూరు కావడంతో పరిగి బార్ అసోసియేషన్ సభ్యులు శుక్రవారం పరిగి పట్టణంలోని ఎమ్మెల్యే నివాసంలో ఎమ్మెల్యే టీఆర్ఆర్ ను కలిసి సన్మానించారు. పరిగికి సివిల్ కోర్టు మంజూరు కావడానికి కృషి చేసినందుకు ఈ సందర్భంగా టి ఆర్ ఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు.రిపోర్టర్ మంగలి ప్రకాష్ కుమార్