BREAKING
గుండె స్టెంట్ల భద్రతపై ఆందోళన! నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమైన నాని 'ది ప్యారడైజ్'.. డేట్ లాక్! రైతులకు 24 గంటల కరెంటు ఇవ్వాలి. • నడిపెల్లి విజిత్‌ కుమార్‌ హీరోగా మారిన జబర్దస్త్ ఇమ్మాన్యుయేల్.. 'డెస్టినీ' ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల విషాదం.. 'కప్పి స్క్వాడ్' వెబ్ సిరీస్ దర్శకుడు బేల్‌రాజ్ కలరిక్కల్ హఠాన్మరణం విజయవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న విజయ్ దేవరకొండ, రష్మిక.. 'రణబాలి' సక్సెస్‌పై జోరుగా స్పందన నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి చేతుల మీదుగా అభివృద్ధి పనులకు శంకుస్థాపన శ్రీ మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడిగా సాయి పటేల్ 'ఐ హేట్ మ్యారేజ్' టీజర్ విడుదల.. నేటి Gen Z ఆలోచనలతో ఆకట్టుకుంటున్న రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు తీపికబురు.. వరుసగా నాలుగు రోజుల సెలవులు! ఎన్నికల విధుల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు లేదు యూట్యూబ్ సెన్సేషన్ అజయ్ హీరోగా కొత్త సినిమా షురూ.. ఘనంగా ప్రారంభోత్సవం హైకూ' మనల్ని కాలేజీ రోజుల్లోకి తీసుకెళ్లే సిన్సియర్ లవ్ స్టోరి: కోన వెంకట్ మహాలక్ష్మి దేవిగా దర్శనమిచ్చిన అమ్మవారు వైకాపా ఎంపీటీసీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి

పైలెట్ రోహిత్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు: యాలాల బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక

Select Suryaa Now
పైలెట్ రోహిత్‌రెడ్డిపై తప్పుడు ప్రచారం చేస్తే సహించేది లేదు: యాలాల బిఆర్ఎస్ నాయకుల హెచ్చరిక


యాలాల, మేజర్ న్యూస్: తాండూరు మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డిపై సామాజిక మాధ్యమాల్లో తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్న వారిని గుర్తించి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని యాలాల మండల బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం యాలాల మాజీ జడ్పీటీసీ సిద్రాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు యాలాల పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, సోషల్ మీడియాలో ఫేక్ వార్తలు ప్రచారం చేస్తూ పైలెట్ రోహిత్‌రెడ్డి ప్రతిష్ఠకు భంగం కలిగించే ప్రయత్నాలను సహించబోమని స్పష్టం చేశారు. తప్పుడు ప్రచారానికి పాల్పడుతున్న వారిని గుర్తించి, సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆశన్న, కమ్మరి శేఖర్, నాగారం పాండు గౌడ్, మహేష్, బాలు, కొత్త శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.