కుల్కచర్లలో వైభవంగా ప్రారంభమైన శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ధ్వజ స్థంభం ప్రతిష్టాపన ఉత్సవాలు
కుల్కచర్ల, మేజర్ న్యూస్:కుల్కచర్ల మండల కేంద్రంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి దేవాలయం ప్రాంగణం నందు ధ్వజ స్థంభం ప్రతిష్టాపన కార్యక్రమంలో భాగంగా శనివారం ఉదయం 9:00 గంటలకి గణపతి పూజ, జలాభిషేకం, పుణ్యవచనము, ధ్వజరోహణం, మాత్రుక నాంది, అఖండ దీప స్థాపన, రక్షబంధన, వాస్తు, క్షేత్రపాలక నవగ్రహ, ప్రధాన కలశ స్థాపనతో పూజా కార్యక్రమాలు పురోహితులు కమ్మదనం వసంతాచార్యులు, పాండురంగాచారి, గురు ఆధ్వర్యంలో ధ్వజస్థంభం దాత సుంకిరెడ్డి ప్రేమ్ ప్రకాష్ రెడ్డి, కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డి దంపతులు,పోచమ్మ తల్లి విగ్రహ దాత సుంకిరెడ్డి మాధవి మన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా వైభవంగా ప్రారంభం అయ్యాయని పోచమ్మ తల్లి ఆలయ ఉత్సవ కమిటీ నిర్వహకులు కర్రె.భరత్ కుమార్, తుప్పలి అశోక్ కుమార్ తెలిపారు. ధ్వజస్థంభం ప్రతిష్టాపన ప్రారంభ పూజా కార్యక్రమాల్లో గ్రామ పెద్దలు స్థానిక సర్పంచ్ వార్వాళ్ళ అంజిలయ్య, శేరి రాంరెడ్డి, బాలముకుందం తదితరులు పాల్గొన్నారు. సాయంత్రం 7 గంటలకి హరికథ పారాయణ శ్రీశ్రీహరి గారిచే భజన కార్యక్రమము ఏర్పాటు చేయడం జరిగిందని, 18వ తేదీన ఆదివారం రోజున ఉ 9 గంటలకి ఆవాహిత మూలమంత్ర జపాలు, మంటపదేవత పూజలు, హోమములు, మహాస్నాపనం, సాముహిక హోమాలు, విగ్రహ ఊరేగింపు, సాయంత్రం 4 గంటలకు ధ్యానాధివాసము, శమాందివాసము, ఫలపుష్ప హిరణ్యాధివాసము హరతి మంత్ర పుష్పము, వేదస్వస్థ మంత్ర పుష్పము, తీర్థ ప్రసాద వితరణ. సాయంత్రం 7 గంటలకి భజన కార్యక్రమాలు, అధ్యాత్మిక ప్రవచనాలు, ప్రవచన కర్త శ్రీశ్రీశ్రీ భాస్కర యోగి గారిచే నిర్వహించడం జరుగుతుందన్నారు.చివరి రోజు 19వ తేదీన 7:10 నిమిషాలకి ఆవాహిత దేవతా పూజాలు, గర్తన్యాసం, దాతున్యాసం, కుంభలగ్న నందు మంత్రస్థాపనం, ధ్వజస్తంభస్థాపనం, బలిప్రధానం, మౌళికాముక్తదేను దర్శనం, పూర్ణాహుతి మహాదాశీర్వచనం, అనంతరం జానపద కళాకారులు శ్రీ జంగిరెడ్డి బృందంచే ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ పూజా కార్యక్రమాల్లో ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు, మహిళలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు.