BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

రేవంత్ రెడ్డి జేబు దొంగ : కేటీఆర్

Select Suryaa Now
రేవంత్ రెడ్డి జేబు దొంగ : కేటీఆర్

హైదరాబాద్‌: కాంగ్రెస్‌ ప్రభుత్వంపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. వెయ్యి రోజుల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వం రూ.4.5 లక్షల కోట్ల అప్పు చేసిందని ఆరోపించారు. ప్రభుత్వం అసమర్థతలో ‘ప్రో మ్యాక్స్‌’, అవినీతిలో ‘ఆల్ట్రా మ్యాక్స్‌’, అరాచకంలో ‘హై మ్యాక్స్‌’గా మారిందని ఎద్దేవా చేశారు. వెయ్యి రోజుల్లో వెయ్యికి పైగా మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.

కేసీఆర్‌ హయాంలో దేశంలోనే తొలిసారిగా రైతు బీమా అమలు చేశామని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ఉన్న బీమా వ్యవస్థను నాశనం చేసిందని కేటీఆర్‌ విమర్శించారు. రైతుబంధు నిలిచిపోయి ‘రాహుల్‌ బంధు’ మొదలైందని, రైతుల డబ్బులు దొంగలించిన ‘జేబుదొంగ’ రేవంత్‌రెడ్డి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

యువతకు ఇచ్చిన హామీలపై ప్రశ్నలు

కాంగ్రెస్‌కు ఓటేసిన యువతకు ఇప్పుడు ఏం మిగిలిందని కేటీఆర్‌ ప్రశ్నించారు. జెన్‌జీతో ఫోజులు కొడుతున్న రాహుల్‌గాంధీకి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలు తెలుస్తున్నాయా అని నిలదీశారు. యువత ఉద్యోగాలు అడుగుతుంటే ప్రభుత్వం జేబులు నింపుకోవడంలో బిజీగా ఉందని ఆరోపించారు.

అసెంబ్లీ సమావేశాల్లో యువతకు ఉద్యోగాల అంశంపై ప్రభుత్వాన్ని నిలదీస్తామని, హామీ ఇచ్చిన రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నిస్తామని తెలిపారు. పాలిటెక్నిక్‌ విద్యార్థులకు వ్యతిరేకంగా తీసుకొచ్చిన జీవో నంబర్‌ 97పైనా అసెంబ్లీలో ప్రశ్నిస్తామని చెప్పారు. రాజశేఖర్‌రెడ్డి ప్రారంభించిన పథకాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తొలగించిందని కేటీఆర్‌ ఆరోపించారు.