BREAKING
సన్న వడ్లకు రూ.500 బోనస్: అక్టోబర్ 15 నుంచి ధాన్యం కొనుగోళ్లు డీజేలపై పోలీసుల నిఘా: గణేష్ ఉత్సవాలపై ప్రత్యేక నజర్ ఈ నెల 26న కౌటిల్య కొలోక్వి నాలుగవ ఎడిషన్ ను ప్రకటించిన కౌటిల్య స్కూల్ ఆఫ్ పబ్లిక్ పాలసీ ప్రపంచ బాక్సాఫీస్ వద్ద క్రిస్టోఫర్ నోలన్ రికార్డుల ప్రభంజనం.. 'డెడ్‌పూల్ అండ్ వుల్వరిన్' రికార్డును బద్దలుకొట్టిన 'ది ఒడిస్సీ' దిగ్గజ నటుడు అస్రానీకి అక్షయ్ కుమార్ భావోద్వేగ నివాళి.. 'హైవాన్' చిత్రంలో చివరి షాట్ వీడియో వైరల్ మిర్జాపూర్ ది మూవీ బాక్సాఫీస్ ఊచకోత.. మొదటి రోజే 25 కోట్ల వసూళ్లతో రికార్డుల సునామీ కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై బీఆర్‌ఎస్ నిరసనలు… ఆటో కార్మికుల హామీల అమలులో వైఫల్యాన్ని నిరసిస్తూ భారీ ఆటో ర్యాలీ… 'సీఎస్ఎస్ షీల్డ్' కార్యక్రమానికి జితేంద్ర సింగ్ మద్దతు యాక్సెస్ అండ్ బెనిఫిట్-షేరింగ్ నిధుల పంపిణీలో రూ. 200 కోట్ల మైలురాయిని దాటిన జాతీయ జీవవైవిధ్య అథారిటీ కోల్ ఇండియా బొగ్గు ఉత్పత్తి, సరఫరా వేగవంతం వడోదరలో ఉత్సాహంగా ఫిట్ ఇండియా, సైక్లోథాన్ పాట్నాలోని మనేర్ దియారా ప్రాంతంలో ప్రవాహ ఉధృతి ఇండోనేషియాలో 200 పైగా విమానాలు రద్దు లండన్ హీత్రూ విమానాశ్రయానికి నిలిచిపోయిన రైళ్లు ఈజిప్టులో డ్రగ్స్ కేసులో 11 మందికి మరణశిక్ష

దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ప్రజా కోర్టులో ఎండగడతాం ….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

Select Suryaa Now
దుర్మార్గపు కాంగ్రెస్ పాలనను ప్రజా కోర్టులో ఎండగడతాం  ….ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి

 

సూర్య, హుజురాబాద్.
వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో అన్ని అవకతవకలేనని, ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కి దుర్మార్గపు పాలన చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజా కోర్టులో బి ఆర్ ఎస్ ఎండగడుతుందని హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సమరభేరి కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి పెద్ద ఎత్తున కార్యకర్తలు నాయకులు హాజరై మానవహారంగా ఏర్పడి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రజలను మభ్యపెట్టడానికి అనేక వాగ్దానాలు చేసి గద్దెనెక్కిందని అన్నారు. గద్దినెక్కిన తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేసిందని, ఆరు గ్యారెంటీలు, 420 హామీలు మర్చిపోయిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ తప్పులను ప్రశ్నిస్తే నాయకుల పై తప్పుడు కేసులు పెడుతూ నిరంకుశ పాలన చేస్తుందన్నారు. ఇప్పటికే ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గ పాలన పై బి ఆర్ ఎస్ పార్టీ సమరభేరీ కార్యక్రమం చేపడుతూ ప్రజలను ప్రజలను చైతన్యవంతం చేస్తుందన్నారు. వారం రోజుల రోజుకు ఒక అంశంపై రోజుకు ఒక మండలంలో ప్రభుత్వ తప్పులను ఎండబెట్టడం పార్టీ చేస్తుందన్నారు. ప్రజలకు గులాబీ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ బండ శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు కోలిపాక శ్రీనివాస్, సింగిల్ విండో అధ్యక్షులు ఎడవెల్లి కొండల్ రెడ్డి, గంద శ్రీనివాస్ తిరుపతిరెడ్డి పింగిలి రమేష్ తదితరులు పాల్గొన్నారు