BREAKING
హీరో సందీప్ కిషన్ 'సిగ్మా' సినిమా ఆడియో, ట్రైలర్ లాంచ్ డేట్ ఫిక్స్: అక్టోబర్ 2న గ్రాండ్ రిలీజ్ రేపు ఆదోనిలో గణనాథుని నిమజ్జనం...!! కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు

420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన..

Select Suryaa Now
420 హామీల ఫ్లెక్సీతో బీఆర్ఎస్ నిరసన  కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై గంగుల కమలాకర్ ధ్వజం  కరీంనగర్‌లో బీఆర్ఎస్ భారీ నిరసన..
 
సూర్య కరీంనగర్ ప్రతినిధి :కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులు పూర్తయిన సందర్భంగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు కరీంనగర్ తెలంగాణ చౌక్‌లో మాజీ మంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. సుమారు 500 మంది కార్యకర్తలు, ప్రజలు పాల్గొని కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్రభుత్వం ఇచ్చిన 420 హామీలతో కూడిన భారీ ఫ్లెక్సీని ప్రదర్శిస్తూ వినూత్నంగా నిరసన తెలిపారు.ఈ సందర్భంగా గంగుల కమలాకర్ మాట్లాడుతూ, అబద్ధపు హామీలతో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని విమర్శించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. రైతు బీమా, కల్యాణలక్ష్మి, ఫీజు రీయింబర్స్‌మెంట్, రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్, ఆసరా పెన్షన్లు, యువతులకు స్కూటీల హామీలను ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్నారు. ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు బీఆర్ఎస్ ప్రజల పక్షాన పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.అనంతరం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చెల్లించాల్సిన బకాయిలను సూచిస్తూ రూపొందించిన ‘బాకీ కార్డు’లను బాటసారులు, వాహనదారులు, బస్సు ప్రయాణికులకు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ స్వయంగా అందించారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నరాదాసు లక్ష్మణ్ రావు, పార్టీ నగర అధ్యక్షులు చల్ల హరి శంకర్, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ పొన్నం అనిల్ కుమార్ గౌడ్, పార్టీ మండల శాఖ అధ్యక్షులు పెండ్యాల శ్యాం సుందర్ రెడ్డి, కాసారపు శ్రీనివాస్ గౌడ్, మైనారిటీ నగరశాఖ అధ్యక్షులు మీర్ సౌకత్ అలీ, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, మాజీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.