BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి

Select Suryaa Now
కేరళలో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో సందడి

సీఎం వి.డి. సతీసన్‌తో భేటీ
తిరువనంతపురం: పోర్చుగల్ ఫుట్‌బాల్ లెజెండ్ క్రిస్టియానో రొనాల్డో సోదరి ఎల్మా అవేరో కేరళ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి వి.డి. సతీసన్‌ను కలిశారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆత్మీయ సంభాషణ జరిగింది.

ముఖ్యమంత్రి సతీసన్ ఈ భేటీకి సంబంధించిన వివరాలను పంచుకుంటూ కేరళలో ఫుట్‌బాల్‌కు, ముఖ్యంగా క్రిస్టియానో రొనాల్డోకు ఉన్న అపారమైన క్రేజ్, అభిమానుల ప్రేమ గురించి ఎల్మాకు వివరించినట్లు తెలిపారు.

కేరళ అభిమానుల తరఫున ఈ హృదయపూర్వక ప్రేమ సందేశాన్ని రొనాల్డోకు తప్పకుండా చేరవేస్తానని ఎల్మా అవేరో హామీ ఇచ్చారని సీఎం పేర్కొన్నారు. రొనాల్డో సోదరి కేరళ పర్యటనకు రావడం, సీఎంను కలవడంతో స్థానిక ఫుట్‌బాల్ అభిమానుల్లో తీవ్ర ఉత్సాహం వ్యక్తమవుతోంది.