BREAKING
కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన

Select Suryaa Now
1,114 మృతదేహాలు వెలికితీత..ప్రధాని ప్రకటన

కాఠ్‌మాండ్: నేపాల్‌లో సంభవించిన వినాశకరమైన ఆకస్మిక వరదలు తీవ్ర విషాదాన్ని నింపాయి. సహాయక చర్యల్లో ఇప్పటివరకు మొత్తం 1,114 మృతదేహాలను వెలికితీసినట్లు నేపాల్ ప్రధాని బాలేంద్ర (బాలేన్) షా వెల్లడించారు.

అయితే, డిఎన్‌ఏ నమూనాల ద్వారా గుర్తింపు ప్రక్రియ సంక్లిష్టంగా మారడంతో ఇప్పటివరకు కేవలం 95 మృతదేహాలను మాత్రమే గుర్తించి, వారి కుటుంబ సభ్యులకు అప్పగించామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ విపత్తు వల్ల సంభవించిన ప్రాణనష్టంపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. గురుతుపట్టలేని విధంగా ఉన్న మృతదేహాల ఆధారాలు, డిఎన్‌ఏ (DNA) నమూనాలను భద్రపరుస్తున్నట్లు పేర్కొన్నారు.

గుర్తింపు ప్రక్రియ పూర్తయిన వెంటనే మృతదేహాలను బంధువులకు అందజేస్తామని, మిగిలిన వారి గుర్తింపు కోసం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగిస్తున్నామని స్పష్టం చేశారు. ఇంకా వేలాది మంది గల్లంతైనట్లు సమాచారం అందడంతో నేపాల్ సైన్యం, పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు.