BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు

Select Suryaa Now
ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) నిర్వహిస్తున్న కార్గో సేవలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయి. రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీసీ కార్గో నిర్వహణ బాధ్యతలను ఒక ప్రముఖ ప్రైవేట్ సంస్థకు అప్పగిస్తూ దాదాపు 10 నుండి 15 ఏళ్ల కాలపరిమితితో అధికారిక ఒప్పందం కుదిరినట్లు సమాచారం.

ఇప్పటివరకు కార్గో విభాగంలో విధులు నిర్వహించిన ఆర్టీసీ సిబ్బందిని తిరిగి రవాణా (ఆర్టీసీ) డ్యూటీల్లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 2020లో ప్రారంభమైన ఈ కార్గో సర్వీసులు తక్కువ కాలంలోనే మంచి ప్రజాదరణ పొందాయి. అయితే ఇప్పుడు ఉన్నపళంగా ఈ సేవలను ప్రైవేట్ పరం చేయడం గమనార్హం.

ఆర్టీసీ కార్గో సేవలు ప్రైవేట్ సంస్థ పరిధిలోకి వెళ్లడంతో భవిష్యత్తులో పార్సిల్ చార్జీలు విపరీతంగా పెరిగే అవకాశం ఉందని సామాన్య ప్రజలు, వ్యాపారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ రంగ సంస్థలోని కీలక సేవలను ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టడంపై పలు రవాణా సంఘాల నుంచి కూడా భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.