BREAKING
Huawei సంచలనం - నేడే ఒకేసారి 5 కొత్త ప్రొడక్ట్స్ లాంచ్ - Watch GT 7 నుండి MatePad Pro వరకు - Munich లో Chase The Wild ఈవెంట్ లైవ్! కొండా సురేఖ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం యూటర్న్? రంగంలోకి అగ్రనేతలు! కాంగ్రెస్ ‘1000 రోజుల విఫల పాలన’పై ఉధృతమైన బీఆర్ఎస్ నిరసనలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి తెలంగాణ ఆర్టీసీ కార్గో సేవలు కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై బీఆర్‌ఎస్ ఛార్జ్‌షీట్: హరీశ్ రావు తీవ్ర ధ్వజం రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్ నెరవేరిన ఉత్తరాంధ్ర వాసుల కల ..తరలి వచ్చిన గోదారమ్మ నేడు లాచనంగా జలాలు విడుదల చేయనున్న చంద్ర బాబు భూభారతి రీ-సర్వేపై అవగాహన సదస్సు మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: మత్స్యకారులతో మమేకమై పింఛన్ల పంపిణీ Google షాకింగ్ డెసిషన్ - 8 ఏళ్ల Google Assistant క్లోజ్ - సెప్టెంబర్ 4 నుండి శాశ్వతంగా బంద్ - ఇక అన్ని ఫోన్లలో Gemini యే! Apple కంపెనీలో ఊహించని బిగ్ షాక్ - టాప్ పదవిలో భారీ మార్పు! కమర్షియల్ గ్యాస్ వినియోగదారులకు షాక్: రూ. 9.50 పెరిగిన సిలిండర్ ధర.. కొత్త రేట్లు ఇవే! దుల్కర్ ఐ యామ్ గేమ్ సెప్టెంబర్ 3న రిలీజ్ - రోమాంచకంతో బిగ్ క్లాష్! రామాయంపేటలో రెండు ప్రెస్‌క్లబ్‌ల రద్దు త్వరలో పారదర్శకంగా ఎన్నికలు నేపాల్‌లో కొనసాగుతున్న సహాయక చర్యలు

మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: మత్స్యకారులతో మమేకమై పింఛన్ల పంపిణీ

Select Suryaa Now
మొగల్తూరులో సీఎం చంద్రబాబు పర్యటన: మత్స్యకారులతో మమేకమై పింఛన్ల పంపిణీ

పశ్చిమ గోదావరి: పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం నియోజకవర్గం మొగల్తూరులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంగళవారం పర్యటించారు. ‘పేదల సేవలో’ కార్యక్రమంలో భాగంగా ఆయన ప్రత్యక్షంగా మత్స్యకారుల కుటుంబాలను కలిసి పింఛన్లను పంపిణీ చేశారు.

ఈ పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు నేరుగా వేటకు వెళ్లే ఫెర్రీ పాయింట్‌కు చేరుకున్నారు. అక్కడ పడవల వద్ద కూర్చున్న పలువురు మత్స్యకారులతో ఆప్యాయంగా ముచ్చటించారు. తిరుమని స్వామి అనే మత్స్యకారుడికి ముఖ్యమంత్రి స్వయంగా పింఛను సొమ్మును అందజేశారు. వారి కుటుంబాల యోగక్షేమాలను అడిగి తెలుసుకోవడంతో పాటు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందుతున్న తీరుపై ఆరా తీశారు. ప్రభుత్వ పథకాల అమలు పట్ల మత్స్యకారుల కుటుంబాలు సంతృప్తి వ్యక్తం చేశాయి. అలాగే సముద్ర వేట సమయంలో తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను కూడా వారు సీఎం దృష్టికి తీసుకువెళ్లగా, ఆయన సానుకూలంగా స్పందించారు.