BREAKING
కరప వారాహి ఆలయం స్వాధీనంపై జనసేన నేత చిక్కాల దొరబాబు భావోద్వేగం: దేవాదాయ శాఖ చర్యలపై ఆవేదన కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు

పేదలకు వైద్య సేవలే లక్ష్యం

Select Suryaa Now
పేదలకు వైద్య సేవలే లక్ష్యం

అయ్యాలూరివారిపల్లిలో వైద్య పరీక్షలు నిర్వహించిన డాక్టర్ మల్లికార్జున రెడ్డి

పామూరు (సి ఎస్ పురం), మేజర్ న్యూస్   : 

 పేద, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పామూరు రవణమ్మ మెమోరియల్ మల్లికార్జున రెడ్డి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం సి ఎస్ పురం మండలంలోని అయ్యాలూరివారిపల్లిలో 42వ ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.శిబిరంలో ఎముకలు, కీళ్ల సమస్యలతో బాధపడుతున్న గ్రామస్తులకు ప్రత్యేక వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం అవసరమైన వారికి ఉచితంగా మందులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ పొలిమేర మల్లికార్జున రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజలు ఆరోగ్య సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఎప్పటికప్పుడు వైద్య పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. పేదలకు వైద్య సేవలు అందించడమే తమ సేవా సంకల్పమని తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకు ఉచిత వైద్య శిబిరాలను నిరంతరం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.