BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి

Select Suryaa Now
బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయి


డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్
రాహుల్ గాంధీపై ఎఫ్ఐఆర్ ను నిరసిస్తూ వికారాబాద్‌లో కాంగ్రెస్ భారీ ర్యాలీ
వికారాబాద్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 01): లోక్‌సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై కక్షపూరితంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడాన్ని నిరసిస్తూ, ఉత్తరాఖండ్‌లోని హాల్ద్వానీలో జరిగిన ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ ఏఐసీసీ పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ర్యాలీలో తాండూర్ ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా డీసీసీ అధ్యక్షుడు జాదవ్ ధారాసింగ్ నాయక్ మాట్లాడుతూ.. రాహుల్ గాంధీపై కక్షపూరితంగా ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడం అప్రజాస్వామిక చర్య అని విమర్శించారు. బీజేపీ ప్రభుత్వం దేశంలోని బడుగు, బలహీన వర్గాల ప్రజల పట్ల వివక్ష చూపడం హేయమైన చర్య అన్నారు. హాల్ద్వానీ ఘటనకు బాధ్యులైన బీజేపీ కార్యకర్తలపై తక్షణమే చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.బాధ్యులపై చర్యలు తీసుకోకపోతే బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించే వరకు కాంగ్రెస్ పార్టీ ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని, ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతుందని ఆయన పేర్కొన్నారు.ఈ నిరసన కార్యక్రమంలో ఏఐసీసీ సభ్యుడు సంతోష్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజేష్ రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ గడ్డం అనన్య, ఏఎంసీ చైర్మన్లు శ్రీనివాస్ ముదిరాజ్, వడ్డే శ్రీనివాస్, భాస్కర్ రెడ్డి, మహేందర్ రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సుధాకర్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ సత్యనారాయణ, సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి, కిషన్ నాయక్, చిగుళ్లపల్లి రమేష్, మహిపాల్ రెడ్డి, ఉత్తమ్ చంద్, అమీర్ అబ్దుల్లా, యూత్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సతీష్ రెడ్డి, మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సంతోష, మైనారిటీ సెల్ చైర్మన్ ఖాజా సలావుద్దీన్ హైమద్, ఎస్సీ సెల్ అధ్యక్షుడు రాజు, జిల్లా కార్యవర్గ సభ్యులు, మండల అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.