BREAKING
కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత

Select Suryaa Now
మైనారిటీ మహిళలకు ఆర్థిక చేయూత

మంత్రి శ్రీధర్ బాబు 

225 మందికి రూ.50 వేల చొప్పున చెక్కుల పంపిణీ

మేడ్చల్ జిల్లా ప్రతినిధి, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1):
మైనారిటీ మహిళలను ఆర్థికంగా స్వావలంబులుగా తీర్చిదిద్దేందుకు ‘ఇందిరమ్మ మైనారిటీ మహిళా యోజన’ను అమలు చేస్తున్నామని రాష్ట్ర మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మంగళవారం మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన కార్యక్రమంలో 225 మంది మైనారిటీ మహిళా లబ్ధిదారులకు ఒక్కొక్కరికి రూ.50 వేల చొప్పున చెక్కులు పంపిణీ చేశారు.

స్వయం ఉపాధి, చిన్నతరహా వ్యాపారాలకు ఈ ఆర్థిక సహాయం ఉపయోగపడుతుందని మంత్రి పేర్కొన్నారు. లబ్ధిదారుల ఖాతాల్లో నేరుగా నిధులు జమ చేయడంతో పాటు మహిళలకు కుట్టు మిషన్లు అందిస్తున్నట్లు తెలిపారు. మైనారిటీల జీవనోపాధి, విద్య, మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తోందన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, జిల్లా కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు.