BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

"చేతకాకపోతే తప్పుకోండి"

Select Suryaa Now
"చేతకాకపోతే తప్పుకోండి"

ఇంటిగ్రేటెడ్ స్కూల్ పనుల్లో జాప్యంపై ఎమ్మెల్యే ఆగ్రహం

“చేతకాకపోతే తప్పుకోండి.. 4న సీఎం దృష్టికి తీసుకెళ్తా”

యాలాల, మేజర్ న్యూస్ (సెప్టెంబర్ 1): మండలంలోని దౌలాపూర్ సమీపంలో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణ పనుల్లో జాప్యంపై తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శంకుస్థాపన చేసి ఏడాది పూర్తవుతున్నా పనుల్లో ఆశించిన పురోగతి లేకపోవడంపై ప్రాజెక్టు మేనేజర్‌ను ప్రశ్నించారు.

“పనులు చేయలేకపోతే బాధ్యతల నుంచి తప్పుకోండి.. మిమ్మల్ని నమ్ముకుంటే నేను మునుగుతా” అంటూ హెచ్చరించారు. ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులో జాప్యాన్ని సహించబోమని స్పష్టం చేసిన ఎమ్మెల్యే, సెప్టెంబర్ 4న ముఖ్యమంత్రి దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్తానని తెలిపారు. ఇకనైనా పనుల్లో వేగం పెంచి నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.

కార్యక్రమంలో యాలాల సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు మహిపాల్, సీనియర్ నాయకులు కరణం పురుషోత్తం రావు, హన్మంత్ ముదిరాజ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అగ్గనూర్ వీరేశం తదితరులు పాల్గొన్నారు.