BREAKING
కీసరలో కలకలం: ఐదు లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన సీఐ అంజనేయులు, ఎస్‌ఐ జ్ఞానేందర్ రెడ్డి ద్రవ్యోల్బణ కట్టడికి ఫెడ్ వడ్డీ రేట్ల పెంపు గణేష్ మండపంలో మంటలు మార్కెట్లో రికార్డు స్థాయికి మక్కల ధర.. క్వింటా రూ.2,775 పలికిన వైనం! దేశవాళీ లీగ్‌లో పరుగుల వరద.. భారత వన్డే జట్టులో చోటు దక్కించుకున్న నమన్ ధీర్! జనాభా సంక్షోభం దిశగా భారత్.. భారీగా తగ్గుతున్న జననాల రేటు! భారత ప్రధాని నరేంద్ర మోదీ జన్మదినం.. సాధారణ స్వయంసేవక్ నుంచి గ్లోబల్ లీడర్‌గా అద్భుత ప్రస్థానం! వంటనూనె దిగుమతి సుంకాలను తగ్గించే యోచనలో కేంద్రం.. పండుగ వేళ సామాన్యులకు ఊరట! పోస్టల్ శాఖలో వేలాది ఉద్యోగాలు.. వన్ టైమ్ రిజిస్ట్రేషన్‌కు నేడే చివరి గడువు! తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా వెండి ధరలు.. నేటి పసిడి లోహం రేట్లు ఎలా ఉన్నాయంటే? తెలుగు రాష్ట్రాల్లో స్థిరంగా బంగారం ధరలు.. నేటి పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే? పురి బీచ్‌లో సుదర్శన్ పట్నాయక్ అద్భుత సైకత శిల్పం: ప్రధాని మోదీ జన్మదిన వేడుకలు మధురై మీనాక్షి అమ్మవారి ఆలయంలో మహా కుంభాభిషేకానికి ముమ్మర ఏర్పాట్లు: కొన్ని గంటల్లో అంకురార్పణ రష్యాపై అమెరికా ప్రతినిధుల సభ ఆమోదం: చైనా, భారత్‌ సహా వాణిజ్య భాగస్వాముల టార్గెట్‌గా ఆంక్షల బిల్లు కర్ణాటకలో యాభై లక్షల రూపాయల లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన తహసీల్దార్

రేవంత్ సర్కార్ 1000 రోజుల రిపోర్ట్ కార్డు ఫెయిల్ - 6 గ్యారంటీలలో ఒక్కటీ అమలు కాలేదు - బీజేపీ సంచలన ఆరోపణలు

Select Suryaa Now
రేవంత్ సర్కార్ 1000 రోజుల రిపోర్ట్ కార్డు ఫెయిల్ - 6 గ్యారంటీలలో ఒక్కటీ అమలు కాలేదు - బీజేపీ సంచలన ఆరోపణలు

హైదరాబాద్, 1 సెప్టెంబర్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతీయ జనతా పార్టీ తీవ్రంగా విమర్శించింది. "1000 రోజులు - 1000 అబద్ధాలు - 100% ఫెయిల్యూర్" అని బీజేపీ నేతలు మండిపడ్డారు.బీజేపీ చెప్పిన 5 ఫెయిల్యూర్స్:1. 6 గ్యారెంటీలు గాలికి - ఒక్కటీ పూర్తి కాలేదు
ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారెంటీలలో ఒక్కటీ కూడా 100% అమలు కాలేదు. మహాలక్ష్మి కింద మహిళలకు నెలకు రూ.2500 ఎక్కడ? రైతులకు రూ.15000 ఎక్కడ? 2 లక్షల రుణమాఫీ ఎంత మందికి అయింది? ఇది పూర్తిగా మోసపూరిత ప్రభుత్వం.2. కేంద్రం నిధులు ఇచ్చినా వాడుకోలేని అసమర్థ ప్రభుత్వం
రేవంత్ రెడ్డి "కేంద్రం నిధులు ఇవ్వలేదు" అని అబద్ధం చెబుతున్నారు. నిజం ఏమిటంటే -జాతీయ రహదారులకు రూ.13,000 కోట్లు కేంద్రం ఇచ్చిందిహైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 కి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందికిసాన్ సమ్మాన్, హర్ ఘర్ జల్, ఆయుష్మాన్ భారత్ నిధులు వస్తున్నాయి
కానీ రాష్ట్ర ప్రభుత్వం వాటిని వాడుకోవడంలో పూర్తిగా విఫలమైంది. కమీషన్లు, కాంట్రాక్టుల కోసమే పాకులాడుతున్నారు తప్ప అభివృద్ధి పట్టదు.3. అప్పుల తెలంగాణగా మార్చారు
10 ఏళ్లలో కేసీఆర్ అప్పులు చేస్తే, 2.5 ఏళ్లలో రేవంత్ ఆ అప్పులను డబుల్ చేశారు. ప్రతి పథకానికి అప్పు, ప్రతి ప్రచారానికి అప్పు. తెలంగాణను అప్పుల ఊబిలోకి నెట్టారు.4. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీశారు
మూసీ పేరుతో పేదల ఇళ్లు కూల్చడం, హైడ్రా పేరుతో బుల్డోజర్ రాజకీయం - దీనివల్ల పెట్టుబడిదారులు భయపడుతున్నారు. నిజమైన పెట్టుబడులు రావడం లేదు, కేవలం MOU ల ప్రచారం మాత్రమే.5. 1000 రోజుల్లో 1000 సార్లు ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు
రేవంత్ రెడ్డి తెలంగాణలో కంటే ఢిల్లీలోనే ఎక్కువ ఉన్నారు. పాలన గాలికి వదిలేసి, తన సీటు కాపాడుకోవడానికి ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతున్నారు.బీజేపీ డిమాండ్:
వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలి - 1000 రోజుల్లో ఎంత అప్పు చేశారు? 6 గ్యారెంటీలకు ఎంత ఖర్చు పెట్టారు? కేంద్ర నిధులు ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు? అని.తెలంగాణ ప్రజలు మార్పు కోసం కాంగ్రెస్ కి ఓటేస్తే, మోసం మాత్రమే మిగిలిందని బీజేపీ స్పష్టం చేసింది.