BREAKING
శ్రీ భీమేశ్వర స్వామివారిని దర్శించిన 1,05,600 మంది భక్తులు మహిళలకు రేవంత్ రెడ్డి సర్కార్ మరో అదిరిపోయే గిఫ్ట్.. ఇంటింటికీ ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం షురూ! ఏపీలో పేదల పాలిట శుభవార్త.. నేటి నుంచి ఎన్టీఆర్ భరోసా కొత్త పింఛన్ల దరఖాస్తులు షురూ! లంచం తీసుకుంటూ ఏసిబికి చిక్కిన హుజురాబాద్ సబ్ జైలర్ దేవేందర్ ఏఐపై రామ్ గోపాల్ వర్మ సంచలన వ్యాఖ్యలు సరూర్‌నగర్ చెరువు వద్ద నిమజ్జన ఏర్పాట్లు ఢిల్లీలో తేలని తెలుగు రాష్ట్రాల నీటి పంచాయితీ బెజవాడ లాడ్జిలో దారుణ హత్య.. ముగ్గురి అరెస్ట్ కన్నీరు పెట్టిన "స్పీకర్"కుర్చీ...! తెలంగాణలో మళ్లీ వర్షాలు… తెలంగాణలో మళ్లీ వర్షాలు… లోకాయన్ 2026 యాత్ర SITAC ఆధ్వర్యంలో ఏఐ, డిజిటలైజేషన్‌లో భారత్-స్వీడన్ భాగస్వామ్యం వెంకటేశ్వర స్వామి సన్నిధిలో దారపనేని పూజలు ఏపీలో జిల్లా పరిషత్‌ల పునర్‌వ్యవస్థీకరణ

చేవెళ్లలో విద్యార్థుల గళం..!

Select Suryaa Now
చేవెళ్లలో విద్యార్థుల గళం..!

హాస్టల్ నిర్మాణంలో ఆలస్యం... ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ ముందు ధర్నా, ప్రభుత్వ తీరుపై నిరసన

డిమాండ్లు నెరవేర్చకపోతే నిరవధిక దీక్షలు : ఎస్ఎఫ్ఐ హెచ్చరిక

చేవెళ్ల, సెప్టెంబర్ 1: చేవెళ్ల ప్రాంతంలో విద్యార్థుల వసతి గృహాల నిర్మాణంలో జరుగుతున్న తీవ్ర ఆలస్యంపై ఎస్ఎఫ్ఐ (స్టూడెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా) ఆధ్వర్యంలో విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. మంగళవారం స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట నిర్వహించిన ధర్నాలో విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొని నినాదాలతో ప్రాంగణాన్ని మార్మోగించారు. “విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడొద్దు”, “వెంటనే హాస్టల్ నిర్మాణం ప్రారంభించాలి” అంటూ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆందోళన సందర్భంగా ఎస్ఎఫ్ఐ చేవెళ్ల డివిజన్ అధ్యక్షుడు ఎర్రవల్లి శ్రీనివాస్, కార్యదర్శి బేగరీ అరుణ్ కుమార్ మాట్లాడుతూ, అధికారుల నిర్లక్ష్యాన్ని తీవ్రంగా ఖండించారు. 2018 సంవత్సరంలోనే ఎస్సీ బాలుర, బాలికల కళాశాల వసతి గృహాలు మంజూరు అయినప్పటికీ ఇప్పటివరకు నిర్మాణ పనులు ప్రారంభం కాకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. “ఒక్క ఇటుక కూడా వేయకపోవడం విద్యార్థుల పట్ల ప్రభుత్వానికి ఉన్న నిర్లక్ష్యానికి నిదర్శనం” అని విమర్శించారు.

ప్రస్తుతం చదువుకుంటున్న విద్యార్థులు సరైన వసతి లేక ఇబ్బందులు పడుతున్నారని, అద్దె ఇళ్లలో ఉండాల్సి వస్తోందని తెలిపారు. అద్దె గృహాల్లో మౌలిక సదుపాయాల లేమి, భద్రత సమస్యలు, చదువుకు అనుకూల వాతావరణం లేకపోవడం వల్ల విద్యార్థులపై తీవ్ర ప్రభావం పడుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా పేద, ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు.

చేవెళ్ల ఎంపీ, ఎమ్మెల్యేలు ఈ సమస్యపై స్పందించడంలో పూర్తిగా విఫలమయ్యారని  ఆరోపించారు. ఎన్నోసార్లు అధికారులను కలసి విన్నవించినప్పటికీ సమస్యను పట్టించుకోలేదని మండిపడ్డారు. “విద్యార్థుల సమస్యలపై ప్రజాప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదు? ఇంకా ఎంతకాలం నిర్లక్ష్యం కొనసాగుతుంది?” అని ప్రశ్నించారు.

వెంటనే వసతి గృహాల నిర్మాణాన్ని ప్రారంభించి, నిర్దిష్ట గడువులో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఆందోళనను మరింత ఉద్ధృతం చేసి రోడ్డు దిగ్బంధాలు, భారీ నిరసనలు, చివరికి నిరవధిక నిరాహార దీక్షలకు కూడా దిగుతామని స్పష్టం చేశారు. విద్యార్థుల సమస్యల పరిష్కారానికి వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ చేవెళ్ల మండల కార్యదర్శి మాల చందు, విద్యార్థి నాయకులు, పెద్ద సంఖ్యలో కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.